- Telugu News Photo Gallery Viral photos Are you using perfumes and body deodorants to avoid sweat and bad smell in summer? know these facts
Perfumes: మీరూ సెంటు వాడుతున్నారా? ఇలా వాడారంటే క్యాన్సర్ ముప్పుతప్పదు..
వేసవిలో చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి కొందరు సెంటు, డియోడరెంట్లు వాడుతుంటారు. ఐతే వీటిని దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన రీతిలో వినియోగించకపోయినా పలు అనారోగ్య మసస్యలు తప్పవంటున్నారు నిపుణులు..
Updated on: Mar 27, 2023 | 7:10 AM

వేసవిలో చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి కొందరు సెంటు, డియోడరెంట్లు వాడుతుంటారు. ఐతే వీటిని దీర్ఘకాలం ఉపయోగించినా, సరైన రీతిలో వినియోగించకపోయినా పలు అనారోగ్య మసస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

నిజానికి పరిమళద్రవ్యాల తయారీలో రకరకాల రసాయనాలను వాడటం వల్ల దీర్ఘకాలం వీటిని వినియోగిస్తే అలర్జీ, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటిల్లోని రసాయనాల వల్ల చర్మం త్వరగా తేమను కోల్పోయి డ్రై అవుతుంది. అందుకే ఒంటిపై చల్లుకునేవి కాకుండా దుస్తులపై స్ప్రే చేసేవి వాడితే మరీ మంచిది.

అలాగే స్నానం చేసిన వెంటనే కాకుండా పూర్తిగా తడారాక, అలంకరణ పూర్తయ్యాక వినియోగించాలి.

రసాయనాలతో తయారు చేసిన సెంటులకు బదులుగా సహజంగా పూలూ, పండ్లతో చేసిన పరిమళాల్ని వినియోగిస్తే ఆరోగ్యం, తాజాదనం మీసొంతం.





























