Human Sacrifice: పదేళ్ల బాలుడి నరబలి.. కొడుకు ఆరోగ్యం కోసం తాంత్రికుడి మాయ మాటలు నమ్మి

మూఢనమ్మకాల ముసుగులో పదేళ్ల బాలుడిని బలిచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తాంత్రికుడి మాటలు నమ్మి సొంత బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే..

Human Sacrifice: పదేళ్ల బాలుడి నరబలి.. కొడుకు ఆరోగ్యం కోసం తాంత్రికుడి మాయ మాటలు నమ్మి
Human Sacrifice in UP
Follow us

|

Updated on: Mar 27, 2023 | 10:46 AM

మూఢనమ్మకాల ముసుగులో పదేళ్ల బాలుడిని బలిచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తాంత్రికుడి మాటలు నమ్మి సొంత బంధువే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్‌ జిల్లా పర్సా గ్రామానికి చెందిన కృష్ణవర్మ అనే వ్యక్తికి వివేక్‌ వర్మ (10) కుమారుడు ఉన్నాడు. కృష్ణవర్మకు అదే గ్రామంలో అనూప్ అనే ఓ బంధువు ఉన్నాడు. అనూప్‌కు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఐతే కొడుకు పుట్టినప్పటి నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో అనూప్‌ ఎందరో వైద్యులను సంప్రదించాడు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అనూప్ ఓ తాంత్రికుడిని సంప్రదించాడు. నరబలి చేస్తే కొడుకు ఆరోగ్యం బాగుటుందని ఆ తాంత్రికుడు అనూప్‌కు తెలిపాడు. తాంత్రికుడి మాటలు నమ్మిన అనూప్‌ మేనమామ చింతారామ్‌తో కలిసి గురువారం రాత్రి వివేక్‌ వర్మను ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతుకోసి హత్యచేసి పరారయ్యాడు.

కొడుకు వివేక్‌ కనిపించలేదంటూ తండ్రి కృష్ణవర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడికోసం కోసం గాలింపు చర్యలు చేపట్టగా అదే రోజు ఇంటి సమీపంలోని పొలాల్లో వివేక్‌వర్మ మృతదేహం లభ్యమైంది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తాంత్రికుడితోపాటు అనూప్‌, అతనికి సహకరించిన చింతారామ్‌ను శనివారం (మార్చి 25) అరెస్టు చేసినట్లు బరైచ్‌ ఎస్పీ ప్రశాంత్‌ వర్మ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles