Gas Price: గ్యాస్‌ వినియోగదారులకు ఊరటనిచ్చే కబురు.. మరో 6 రోజుల్లో కేంద్రం కీలక ప్రకటన

సీఎన్‌జీ, ఎరువులు, గ్యాస్‌ ధరలపై పరిమితులను విధించడంపై కేంద్ర మంత్రివర్గం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. స్థానికంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను ప్రభుత్వం ప్రతీయేట రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఆటోమొబైల్స్‌లో..

Gas Price: గ్యాస్‌ వినియోగదారులకు ఊరటనిచ్చే కబురు.. మరో 6 రోజుల్లో కేంద్రం కీలక ప్రకటన
Gas Price
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 26, 2023 | 7:36 PM

సీఎన్‌జీ, ఎరువులు, గ్యాస్‌ ధరలపై పరిమితులను విధించడంపై కేంద్ర మంత్రివర్గం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. స్థానికంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను ప్రభుత్వం ప్రతీయేట రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఆటోమొబైల్స్‌లో ఉపయోగించే సీఎన్‌జీ, వంట గ్యాస్, విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి, ఎరువుల తయారీకి సహజ వాయువును ఉపయోగిస్తారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) వంటి జాతీయ చమురు కంపెనీలు విక్రయించే గ్యాస్‌కు చెల్లించే రేట్లను రెండు వేర్వేరు ఫార్ములాల ద్వారా నిర్ణయిస్తారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో ఇంధన ధరలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరకున్న విషయం తెలిసిందే. ఇదివరకే అందుబాటులో ఉన్న క్షేత్రాల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర అయితే ఒక మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌ (ఎంఎంబీటీయూ)కు 8.57 డాలర్లు అంటే రూ.705లు, సముద్ర గర్భంలో కొత్తగా కనుగొన్న కష్టతరమైన క్షేత్రాల నుంచి తీసే గ్యాస్ అయితే 12.46 డాలర్లు అంటే రూ.1,026లకు చేరింది. ఈ రేట్లలను ఏప్రిల్ 1న సవరించనున్నారు. లెగసీ ఫీల్డ్‌ల నుంచి వెలికితీసే గ్యాస్ ధరలు ప్రతి ఎంఎంబీటీయూకు 10.7 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. మన కరెన్సీలో రూ.881లన్నమాట. ఇక కష్టతరమైన ఫీల్డ్‌ల నుంచి వచ్చే గ్యాస్ ధరలలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.

సీఎన్‌జీ, వినియోగదారులకు పైప్‌ ద్వారా అందించే గ్యాస్ రేట్లు ఇప్పటికే 70 శాతం పెరిగాయి. ఏప్రిల్ 1న సవరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగదారులు డిమాండ్‌, ఉత్పత్తిదారుల లబ్ధిని పరిగణనలోకి తీసుకుని గ్యాస్ ధరల సవరణను పరిశీలించడానికి ప్రభుత్వం గతేడాది ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు అందించిన నివేదికను కేబినెట్ పరిశీలించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల్లో గ్యాస్‌ను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని, రాష్ట్ర స్థాయి వ్యాట్‌లకు బదులుగా గ్యాస్‌పై జీఎస్‌టీ వంటి ఉమ్మడి పన్ను విధించడం, దానిని 3 శాతం నుంచి 24 శాతం వరకు పెంచడం వంటివి ఉన్నాయి. త్వరలోనే మంత్రివర్గం ఈ నివేదికను పరిశీలించే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశంలో సహజ వాయువు ఆధారిత గ్యాస్‌ వినియోగదారుల వాటా 6.3 శాతం ఉండగా అది 2030 నాటికి 15 శాతానికి పెరగాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశంలో వీటి ధరలు చివరిసారిగా అక్టోబర్ 1న సవరించారు. ప్రస్తుతం ఏప్రిల్ 1న మరోమారు సవరించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మించి
ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మించి
తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్
తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్
అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
అద్దెకొచ్చి ఎంత పని చేశారురా.. చివరికి సీన్ సితారయ్యింది.!
ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన తిమింగలం..! సరికొత్త రికార్డ్‌
ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటిన తిమింగలం..! సరికొత్త రికార్డ్‌
మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..
మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..
ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షో లో తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షో లో తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
స్పిరిట్‌ మూవీ కథ ఇదేనా? డార్లింగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా.
స్పిరిట్‌ మూవీ కథ ఇదేనా? డార్లింగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ పక్కా.
పాండాలకు పేరు పెట్టేందుకు రూ.76లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం..!
పాండాలకు పేరు పెట్టేందుకు రూ.76లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం..!
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
కోలీవుడ్ హీరోలకు ఎందుకీ విరక్తి..?
కోలీవుడ్ హీరోలకు ఎందుకీ విరక్తి..?