ALH Dhruv Mark 3: ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌.. వైరల్ అవుతోన్న వీడియో..

ఇండియన్‌ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ALH ధ్రువ్ మార్క్ 3 ఆదివారం (మార్చి 26) కేరళలోని కొచ్చిలో కూలిపోయింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు..

ALH Dhruv Mark 3: ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన కోస్ట్‌గార్డ్‌ హెలికాప్టర్‌.. వైరల్ అవుతోన్న వీడియో..
ALH Dhruv Mark 3
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 26, 2023 | 5:13 PM

ఇండియన్‌ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ALH ధ్రువ్ మార్క్ 3 ఆదివారం (మార్చి 26) కేరళలోని కొచ్చిలో కూలిపోయింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఐసీజీ దర్యాప్తు చేపట్టింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు పైనట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వల్పగాయాలతో ముగ్గురు సిబ్బందిని నేవీ కాపాడినట్లు పేర్కొన్నారు. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెషన్‌లో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగడంతో రన్‌వేను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు.

కాగా మార్చి 8 ముంబై తీరంలో నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో ఏఎల్‌హెచ్‌ ధృవ్ ఛాపర్స్‌ వినియోగాన్ని నేవీ నిలిపివేసింది. ఏఎల్‌హెచ్‌ ధ్రువ్ ఫ్లీట్ కార్యకలాపాలను పునఃప్రారంభించే దిశగా ఐసీజీ ఈ రోజు హెలికాఫ్టర్‌లను టెస్టు చేసింది. దీనిలో భాగంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 1225 గంటలకు హెలికాఫ్టర్‌లో కంట్రోల్ రాడ్‌లను అమర్చిన తర్వాత ఇన్‌ఫ్లైట్ టెస్టులకు సిద్ధం చేశారు. ఇన్‌ఫ్లైట్ తనిఖీలకు ముందు హెచ్‌ఏఎల్‌, ఐసీజీ టీం ఆదివారం గ్రౌండ్ ట్రయల్స్ నిర్వహించాయి. ఈ ట్రయల్స్‌లో టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ విచారణకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.