AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Work: హోంవర్క్‌ చేయలేదని చావగొట్టిన టీచర్‌.. ఏడేళ్ల బాలుడు మృతి

హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల విద్యార్ధిని చావగొట్టాడు ఓ ఉపాధ్యాయుడు. దెబ్బలు తాళలేక విద్యార్ధి శుక్రవారం (మార్చి 24) మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన..

Home Work: హోంవర్క్‌ చేయలేదని చావగొట్టిన టీచర్‌.. ఏడేళ్ల బాలుడు మృతి
7 Year old boy died in Bihar
Srilakshmi C
|

Updated on: Mar 24, 2023 | 5:24 PM

Share

హోంవర్క్‌ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల విద్యార్ధిని చావగొట్టాడు ఓ ఉపాధ్యాయుడు. దెబ్బలు తాళలేక విద్యార్ధి శుక్రవారం (మార్చి 24) మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లోని సహర్సా జిల్లాలో చోటుచేసకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధేపురా జిల్లాలోని భర్రాహి గ్రామానికి చెందిన ఆదిత్య కుమార్ (7)ను సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కమ్‌ హాస్టల్‌లో ఎల్‌కేజీల చదువుతున్నాడు. ఆదిత్యను మార్చి 14న తండ్రి హాస్టల్‌లో జాయిన్‌ చేశాడు. ఈ క్రమంలో బాలుడు హోంవర్క్ చేయలేదని పాఠశాల డైరెక్టర్-కమ్-టీచర్ విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

అప్పటికే బాలుడు మృతి చెందడంతో ఆసుపత్రికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పాఠశాల యాజమన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్లు కొట్టడం వల్లే తమ బిడ్డ మృతి చెందినట్లు ఆదిత్య తండ్రి ప్రకాశ్‌ యాదవ్‌ ఆరోపించాడు. బాలుడి మృతిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆదిత్యను కొట్టిన టీచర్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బ్రజేష్ చౌహాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.