Watch: ఇదేందిరాయ్యా.. ఎగిరెగిరి బస్సు గేరు మార్చాడు ఎరక్కబోయి ఇరుక్కున్నాడు..
పైగా నేనేం చేయాలి, బస్సు పరిస్థితి బాగా లేదని చెబుతున్నాడు సదరు డ్రైవర్. అధికారులు మాత్రం పట్టించుకోకుండా కూర్చుంటారని అంటున్నాడు.
హర్యానా రోడ్‌వేస్, హిమాచల్ రోడ్‌వేస్ బస్సు డ్రైవర్ల వీడియోలు తరచూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌కు సంబంధించిన ఒక బస్సు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో డ్రైవర్ బస్సును టాప్ గేర్‌లో నడపటానికి ఎవరూ ఊహించని టెక్నిక్‌ని ఉపయోగించడం చూపరులను తెగ నవ్వించింది. ఇది చూసిన నెటిజన్లు పలువురు దీనిపై తీవ్రంగా స్పందించారు. యూపీ రోడ్‌వేస్ బస్సుల పరిస్థితి కూడా ఇలాగే ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. కాగా, ఈ విషయాన్ని గుర్తించి సంబంధిత శాఖ అధికారులు బస్సును తనిఖీ చేయగా, అది బాగానే ఉందని, డిపార్ట్‌మెంట్ పరువు తీసేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్నాడని తేలింది. దాంతో అతనిపై చర్యలకు ఉపక్రమించింది UPSRTC.
కేవలం30 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి బస్సు నడుపుతున్న దృశ్యాలు కనిపించాయి. అతడు బస్సును టాప్ గేర్ వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. గేర్ మార్చడానికి అతడు సీటుపై కూర్చుని స్థితిలోనే ఎగిరి దూకుతున్నాడు. గేర్ హ్యాండిల్‌ను పట్టుకుని దానిపైకి లాగుతూ, సీటుపై ఎగురుతున్నాడు. తద్వారా అది వెనుకకు వెళ్లి టాప్ గేర్‌ను ఎంగేజ్ చేస్తుంది. పైగా నేనేం చేయాలి, బస్సు పరిస్థితి బాగా లేదని చెబుతున్నాడు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా కూర్చుంటారని అంటున్నాడు. కాగా, ఈ బస్సు లాల్‌గంజ్ నుండి లక్నో వెళ్తున్న బస్సు నంబర్ UP72 T4621 అని తెలిసింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు, UPSRTC (ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) డిపో అధికారులు స్పందించారు.
ये हैं यूपी रोडवेज की बसें..
ड्राइवर को ‘बवासीर’ नहीं है. रोडवेज बसों को टॉप गियर में डालने का यही तरीका है. ???
लालगंज से लखनऊ आ रही UP72T4621@UPSRTCHQ @dayashankar4bjp @suraj_livee @myogiadityanath @narendramodi pic.twitter.com/OZYzCZ6DgE
— Nomadic Ambuj (@NeerajAmbuj) March 23, 2023
బస్సు వీడియో వైరల్ అయిన వెంటనే, @UPSRTCHQ వ్యక్తి ట్వీట్‌పై ప్రత్యుత్తరం ఇచ్చారు. మీ ఫిర్యాదు అతనితో మాట్లాడిన తర్వాత లాల్‌గంజ్ డిపోలోని అసిస్టెంట్ రీజినల్ మేనేజర్‌కి తెలియజేశారు.. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీని తర్వాత UPSRTC ప్రతాప్‌గఢ్ డిపో పేరుతో ట్విట్టర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. బస్ నంబర్ 4621 పూర్తిగా తనిఖీ చేసినట్టుగా చెప్పారు. బస్సు పూర్తి ఫిట్‌నెస్ కలిగి ఉందన్నారు. బస్సులో గేర్ సంబంధిత సమస్య లేదు. డ్రైవర్ కౌశలపతి కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్నాడు. అతడు రవాణా శాఖ పరువు తీశాడు. అందుకే అతనిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఈ వీడియోకి 77 వేలకు పైగా వీక్షణలు, 1300 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అలాగే, వందలాది మంది వినియోగదారులు దీనిపై స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..