AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరులో భయపెట్టే ప్రదేశాలు… వాటి వెనుక షాకింగ్ నిజాలు..వెళ్లాలంటే గుండెధైర్యం కావాలి..!

కర్ణాటకలోని ప్రసిద్ధ ప్రదేశాల గురించి మీకు తెలుసు. కానీ, బెంగళూరులోని హాంటెడ్ ప్రదేశాల గురించి ఎప్పుడైనా విన్నారా..? అవును, ఇక్కడ చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లాలంటే చాలా మంది భయంతో వణికిపోతారు.

Jyothi Gadda
|

Updated on: Mar 24, 2023 | 2:13 PM

Share
Victoria Hospital- ఆకలితో ఉండే దెయ్యం బెంగళూరు విక్టోరియ ఆసుపత్రి ప్రాంగణాల్లో తిరుగుతుందని నమ్ముతారు. ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఉండే చెట్టు క్రింద ఎవరైనా ఆహారాన్ని వదిలేస్తే తెల్లవారే సరికి అవి అదృశ్యమైపోతాయి. అర్ధరాత్రి ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఓ మహిళ తిరుగుతుందని, గట్టిగా ఏడుస్తుందని ప్రజలు చెబుతుంటారు. ఈ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ ఆత్మ సంచరిస్తుందని, అది ఈ ఆసుపత్రిలో కొన్ని దశాబ్ధాల క్రితం చనిపోయిన ఓ మహిళదని చెబుతుంటారు.

1 / 5
Call Center-  బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మార్గాల్లో మహాత్మా గాంధీ రోడ్డు ఒకటి. ఉద్యోగం నుంచి షాపింగ్ వరకూ అనేక అవసరాలపై ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. అయితే, ఈ కాల్ సెంటర్ రోడ్డు వెనుక ఓ భయానక కథ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాల్ సెంటర్ ఉద్యోగిని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది. కానీ, నేటికీ ఆమె ఆత్మ రాత్రిపూట కాల్ సెంటర్ గుండా వెళ్ళే ప్రజలను వెంటాడుతుందని చెబుతారు. రాత్రిపూట ఓ మహిళ అరుపులు వినిపిస్తున్నట్లు సమాచారం.

2 / 5
Hoskote Route- ఖచ్చితంగా కర్ణాటకలోని భయానక ప్రదేశాలలో ఒకటి. ఈ ఒంటరి రహదారి కొన్ని అతీంద్రియ సంఘటనలకు దారి తీస్తుంది. ఒకసారి ఆటోరిక్షా డ్రైవర్ ఒక వృద్ధురాలు లిఫ్ట్ అడగడం గమనించాడు. డ్రైవరు ఆటో ఆపి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.కానీ డ్రైవరుని బయటికి రమ్మని అడిగితే ఆమె మొహంలో చిరునవ్వు చూసి అనుమానం వచ్చి దెయ్యం అని వెంటనే తెలిసిపోయింది. అతని కారులో దేవుడి ఫోటో ఉండడంతో ఆమె లోపలికి రాలేకపోయిందని అంటున్నారు.

3 / 5
Kalpalli Cemetery- బెంగళూరులోని కల్పల్లి శ్మశానవాటికలో రాత్రిపూట ఒంటరిగా వెళ్లాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఈ భయంకరమైన ప్రదేశం గురించి ఇంకా చాలా కథలు ఉన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం కాగానే సమాధి చుట్టూ ఏడుపులు, నవ్వులు, పాటలు వినిపించడం మొదలవుతుంది. తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి రాత్రిపూట సమాధి చుట్టూ తిరుగుతున్నాడని చాలా మంది చెబుతుంటారు.

4 / 5
Nh4- బెంగళూరులోని NH4 హైవేపై అర్ధరాత్రి సమయాల్లో వెళ్లే ప్రయాణికులు వింత అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. రాత్రివేళ ఈ రహదారి గుండా వెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుందని, డ్రైవర్‌ కారు ఆపి, ఎక్కడికి వెళ్లాలని అడిగేలోపుగానే ఆమె అదృశ్యమైంది. ఈ ఊహించని సంఘటన నుంచి ఆ డ్రైవర్‌ తేరుకునేలోగా ఆ అమ్మాయి మళ్లీ కనిపించి గట్టిగా నవ్వుతుందట. అలా లిఫ్ట్ ఇచ్చిన వాహనాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయని చెబుతున్నారు.

5 / 5