Memes: మీమ్స్ చేయడమంటే భలే ఇష్టమా.? అయితే ఈ జాబ్ మీకోసమే.. లక్షల్లో ప్యాకేజీ.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Mar 24, 2023 | 4:30 PM

మీరూ మీమ్స్ చేస్తారా.? మీమ్స్‌తో సోషల్ మీడియాలో మీకు ప్రత్యేకంగా పేజీ ఒకటుందా.? అయితే ఈ వార్త మీకోసమే..

Memes: మీమ్స్ చేయడమంటే భలే ఇష్టమా.? అయితే ఈ జాబ్ మీకోసమే.. లక్షల్లో ప్యాకేజీ.!
Memes Job
Follow us

మీరూ మీమ్స్ చేస్తారా.? మీమ్స్‌తో సోషల్ మీడియాలో మీకు ప్రత్యేకంగా పేజీ ఒకటుందా.? అయితే ఈ వార్త మీకోసమే. కాలు బయట పెట్టకుండా.. ఇంట్లో నుంచే లక్షల్లో సంపాదన ఆర్జించవచ్చు. కేవలం మీరు చేయాల్సిందల్లా మీమ్స్ చేసుకుంటూ పోవడమే.. దానికి ప్రతిఫలంగా భారీ శాలరీ ప్యాకేజీ మీ సొంతం.! ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? నిజంగా నిజమండీ బాబూ..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే మన పేజీలకు సైతం ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి మీమ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్. ఇక ఈ మీమ్స్‌ను పలు సంస్థలు తమ బ్రాండింగ్‌కు వాడుకుంటున్నాయి. యూజర్లను ఆకట్టుకునే విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తే చాలు.. అవి వైరల్ అయ్యి.. సదరు సంస్థలకు కావల్సినంత పబ్లిసిటీని అందిస్తాయి.

ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన స్టాక్‌గ్రో అనే సంస్థ మీమర్స్‌కు ఓ బంపరాఫర్ ప్రకటించింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఇచ్చి.. నెలకు రూ. 1 లక్ష శాలరీ ఇస్తామని పేర్కొంది. ఫైనాన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ విభాగాలలోని మిలీనియల్స్‌, జనరేషన్‌ జెడ్‌ వయస్సు వారిని లక్ష్యంగా మీమ్స్ చేయాలంటూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్ చూపించి.. అదిరిపోయే మీమ్స్ తయారు చేసెయ్యండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu