AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: అన్నయ్య అన్నప్పుడే అనుమానం.. ప్రియుడే కాలయముడై..

ప్రియుడిని అన్నయ్య అంటూ భర్తతోపాటు అందరినీ నమ్మించింది. చివరికి ప్రియుడే కాళయముడై ఆమె ప్రాణాలను హరించాడు. నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Crime News: అన్నయ్య అన్నప్పుడే అనుమానం.. ప్రియుడే కాలయముడై..
Nagpur Crime
Srilakshmi C
|

Updated on: Mar 26, 2023 | 4:24 PM

Share

ప్రియుడిని అన్నయ్య అంటూ భర్తతోపాటు అందరినీ నమ్మించింది. చివరికి ప్రియుడే కాళయముడై ఆమె ప్రాణాలను హరించాడు. నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ పరిధిలోని వాథోడా చెందిన 45 ఏళ్ల వాసుకి (పేరు మార్చాం)కి భర్త కొడుకు, కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా దీపక్‌ (40) అనే వ్యక్తితో వాసుకి సన్నిహితంగా ఉండేది. దీపక్ స్టార్ బస్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. వాసుకి అతనితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. అతను కూడా ఆమె ఇంటికి వస్తూ ఉండేవాడు. అన్నయ్య అని ఇంట్లో అందరికీ చెప్పినమ్మించింది. ఈక్రమంలో వాసుకి వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు దీపక్ అనుమానం వచ్చింది.

దీంతో వాసుకి, దీపక్‌ ఇద్దరూ కలిసి మార్చి 23న హింగానా సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన దీపక్ వాసుకిపై రాయితో దాడి చేసి హత్య చేసి పరారయ్యాడు. వాసుకి గత మూడు రోజులుగా కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు వాథోడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హింగనా ప్రాంతంలోని బన్వాడి శివర్ వద్ద అదృశ్యమైన మహిళ మృతదేహం కనుగొన్నారు. దీపక్‌పై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా దీపక్‌ నేరం అంగీకరించినట్లు ఓ పోలీసధికారి మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.