Smriti Irani: మిస్‌ ఇండియా అందాల పోటీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ర్యాంప్‌ వాక్‌.. వైరలవుతోన్న పాతవీడియో

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా, రాజకీయవేత్తగా ఎదిగారు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ (47). క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ షోతో కెరీర్‌ ప్రారంభించిన స్మృతి ఆతిష్ అనే సీరియల్‌ తొలిసారిగా నటించారు. ఐతే స్మృతి ఇరానీ టెలివిజన్‌ నటిగా..

Smriti Irani: మిస్‌ ఇండియా అందాల పోటీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ర్యాంప్‌ వాక్‌.. వైరలవుతోన్న పాతవీడియో
Smriti Irani
Follow us

|

Updated on: Mar 24, 2023 | 3:52 PM

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా, రాజకీయవేత్తగా ఎదిగారు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ (47). క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ షోతో కెరీర్‌ ప్రారంభించిన స్మృతి ఆతిష్ అనే సీరియల్‌లో తొలిసారిగా నటించారు. ఐతే స్మృతి ఇరానీ టెలివిజన్‌ నటిగా మెప్పిండానికి ముందే మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారనే విషయం చాలా మందికి తెలియదు. పలు టీవీ సీరియల్లలో నటించినప్పటికీ ఏక్తా కపూర్ సీరియల్, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పాతికేళ్ల క్రితం 1998లో మిస్ ఇండియా అందాల పోటీలో కూడా స్మృతి పాల్గొన్నారు. మినీ స్కర్ట్‌, క్యాప్‌ ధరించి ర్యాంప్‌ వాక్‌ చేస్తున్న పాత వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ర్యాంప్‌పై హుషారుగా నడుస్తున్న స్మృతి ఇరానీని ఈ వీడియోలో చూడొచ్చు.

ఐతే ఈ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పటికీ టాప్ 9 కంటెస్టెంట్స్‌లో ఆమె స్థానం దక్కించుకోలేకపోయారు. ఈ వీడియోలో ఎంతో స్లిమ్‌గా గుర్తుపట్టలేనంతగా ఉన్న స్మృతి ఇరానీని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. గురువారం( మార్చి23)న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్మృతి ఇరానీ నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత 2003లో బీజేపీలో చేరారు. 2004లో మహారాష్ట్ర యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2014లో మోదీ కేబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు. అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by EktaaRkapoor (@ektarkapoor)

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..