‘ఎగిరే చిలకమ్మా.. నా రంగుల మొలకమ్మా.. చిలకలు కొట్టని పండే ఇస్తా’.. ఈ పాట మీకు గుర్తుండొచ్చు. 2006లో పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ మూవీలోని ఈ సాంగ్ అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఇక ఇందులో నటించిన హీరోయిన్ మీరా చోప్రాకు.. ఈ సినిమాలో నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో నటించిన మొదటి చిత్రం ఇది. ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులకు చేరువైంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయిన మీరా చోప్రా తెలుగులో ‘వాన’, ‘మారో’, ‘గ్రీకువీరుడు’ లాంటి చిత్రాల్లో నటించడమే కాదు.. తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అవేమి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. ఈ బ్యూటీకి ఆ తర్వాత అవకాశాలు రావడం తగ్గిపోయాయి.
2021లో అటు హిందీలో ‘నాస్తిక్’.. ఇటు తెలుగులో ‘మొగలిపువ్వు’ అనే సినిమాల్లో నటించింది. అయితే అవి ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. మీరాచోప్రా నటించిన చివరి చిత్రాలు ఇవే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్‌కు కూడా ప్రారంభించాలని చూస్తోందట. మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తోందని సమాచారం.
View this post on Instagram