Ram Charan CDP: రామ్ చరణ్ బర్త్ డే CDP విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Mar 24, 2023 | 9:02 PM

ఈ ఏడాది రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు, ఆయ‌న అభిమానుల‌కు, స‌న్నిహితుల‌కు మ‌రింత ఎమోష‌న‌ల్ మూమెంట్స్‌ను ఇస్తుంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ సూప‌ర్ టాలెంటెడ్ యాక్ట‌ర్ ఈ ఏడాది పాపులారిటీలో ఎవ‌రూ అంద‌నంత గొప్ప స్థానానికి చేరుకున్నారు.

Ram Charan CDP: రామ్ చరణ్ బర్త్ డే CDP విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..
Global Star Ram Charan's
Follow us

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు మార్చి 27. ఆయ‌న పుట్టిన‌రోజు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఆయ‌న అభిమానులు అద్భుత‌మైన బ‌ర్త్ డే కామ‌న్ డిస్‌ప్లే పోస్ట‌ర్ (CDP,)ను విడుద‌ల చేశారు. ప్ర‌తి ఏడాది రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు అభిమానులు పండుగ‌లా సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఈ ఏడాది ఈ సంబ‌రాలు మ‌రింత ఘనంగా జ‌ర‌గ‌బోతున్నాయి.

ఈ సంద‌ర్బంగా రామ్ చ‌ర‌ణ్ సోద‌రుడు వ‌రుణ్ తేజ్ కామ‌న్ డిస్ ప్లే పోస్ట‌ర్‌(CDP)ని విడుద‌ల చేయ‌టంపై ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. అల్లూరి గెట‌ప్‌లో గంభీరంగా ఉన్న చ‌ర‌ణ్ లుక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ‘గ్లోబల్ స్టార్.. మా అన్నయ్య CDPని విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. విన‌య విధేయ‌త‌లు, హార్డ్ వ‌ర్క్‌తో ఆయ‌న మాలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతుంటారు. ల‌వ్ యు అన్న‌’’ అని అన్నారు.

Global Star Ram Charan's Cd

Global Star Ram Charan’s Cd

ఈ ఏడాది రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు, ఆయ‌న అభిమానుల‌కు, స‌న్నిహితుల‌కు మ‌రింత ఎమోష‌న‌ల్ మూమెంట్స్‌ను ఇస్తుంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ సూప‌ర్ టాలెంటెడ్ యాక్ట‌ర్ ఈ ఏడాది పాపులారిటీలో ఎవ‌రూ అంద‌నంత గొప్ప స్థానానికి చేరుకున్నారు. ఆదివారం (మార్చి 26)న మెగా ఫ్యాన్స్ అంద‌రూ క‌లిసి చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు. ఈ వేడుక‌లు హైద‌రాబాద్‌లోని శిల్పాక‌ళా వేదికలో జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో మెగా హీరోలంద‌రూ పార్టిసిపేట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu