AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mini Refrigerator : సమ్మర్ స్పెషల్..! తక్కువ ధరలో లభించే మినీ రిఫ్రిజిరేటర్లు.. అతి తక్కువ స్థలంలోనే సెట్ అవుతాయి..

తక్కువ స్థలంలో పెట్టుకోగలిగిన ఈ పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లను ఒకచోటి నుంచి మరోచోటికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. రూమ్‌లో సులువుగా ఉంచుకోవచ్చు. ధర కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే ఈఎంఐ సదుపాయంతో నెలకు కొంత చెల్లించి వీటిని కొనుగోలు చేయవచ్చు.

Mini Refrigerator : సమ్మర్ స్పెషల్..! తక్కువ ధరలో లభించే మినీ రిఫ్రిజిరేటర్లు.. అతి తక్కువ స్థలంలోనే సెట్ అవుతాయి..
Small Refrigerators
Jyothi Gadda
|

Updated on: Mar 24, 2023 | 7:46 PM

Share

మార్చి నెల ముగుస్తుంది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. రాబోవు రోజులు ఎండలు మరింతగా ముదురుతాయి. ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోవాల్సిన పరిస్థితి రానుంది. ఎండవేడిమి, ఉక్కపోత కారంగా అందరూ ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుంటాయి. దాంతో పాటుగా చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా వాడుతుంటారు. కానీ, సాధారణ మధ్య తరగతి ప్రజలు ఖరీదైన రిఫ్రిజిరేటర్లు కొనలేని వారు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ బుల్లి రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ స్థలంలో సెట్ అయ్యే రిఫ్రిజిరేటర్లు మరింత తక్కువ ధరలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా సులువుగా కొనుగోలు చేయవచ్చు. తక్కువ స్థలంలో పెట్టుకోగలిగిన ఈ పోర్టబుల్ ఫ్రిడ్జ్‌లను ఒకచోటి నుంచి మరోచోటికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. రూమ్‌లో సులువుగా ఉంచుకోవచ్చు. ధర కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే ఈఎంఐ సదుపాయంతో నెలకు కొంత చెల్లించి వీటిని కొనుగోలు చేయవచ్చు. ఎల్‌జీ (LG), గోద్రేజ్ (Godrej), హయెర్ (Haier) లాంటి సంస్థలు మినీ రిఫ్రిజిరేటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇలా సైజ్ తక్కువగా ఉండి.. రూ.10వేల ధరలోపు లభిస్తున్న మినీ రిఫ్రిజిరేటర్లు ఇవే.

1. ఎల్‌జీ 45ఎల్ మినీ రిఫ్రిజిరేటర్ (LG 45L Mini Refrigerator)

చిన్న రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే.. ఎల్‌జీ మినీ రిఫ్రిజిరేటర్ 45L (మోడల్ GL-M051RSWC) మంచి ఆప్షన్‌గా ఉంది. ఈ ఫ్రిడ్జ్ కెపాసిటీ 45 లీటర్లుగా ఉంది. దీంట్లో నీళ్లు, డ్రింక్స్‌తో పాటు ఆహారాన్ని కూడా పెట్టుకోవచ్చు. సింగిల్ డోర్‌తో ఈ రిఫ్రిజిరేటర్ వస్తోంది. 2 స్టార్ ఎనర్జీ సేవింగ్ రేటింగ్ ఉంటుంది. చూసేందుకు స్టైలిష్‌గా.. చిన్నగా కనిపిస్తుంది. దీంట్లో ప్రత్యేకంగా ఫ్రీజర్ కూడా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఎల్‌జీ 45ఎల్ 2స్టార్ రిఫ్రిజిరేటర్ ధర రూ.7,990గా ఉంది. దీనికి సంవత్సరం వారెంటీ కూడా లభిస్తుంది. ఇక ఈఎంఐ సదుపాయం ద్వారా నెలకు రూ.388 చెల్లించి కూడా ఈ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

2. గోద్రెజ్ క్యూబ్ పర్సనల్ కూలింగ్ సొల్యూషన్ (Godrej 30 L Qube Personal Cooling Solution)

గోద్రెజ్ 30ఎల్ క్యూబ్ పర్సనల్ కూలింగ్ సొల్యూషన్ (మోడల్ TEC Qube 30L HS Q103) మినీ రిఫ్రిజిరేటర్ కూడా మంచి ఎంపికగా ఉంటుంది. సింగిల్ డోర్‌తో వస్తున్న ఈ ఫ్రిడ్జ్ సామర్థ్యం 30 లీటర్లుగా ఉంది. అడ్వాన్స్‌డ్ సాలిడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కూలింగ్ టెక్నాలజీని ఈ రిఫ్రిజిరేటర్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ గోద్రెజ్ మినీ రిఫ్రిజిరేటర్ ధర రూ.7,490గా ఉంది. ఈఎంఐ సదుపాయం ద్వారా నెలకు రూ.353 చెల్లించి కూడా సొంతం చేసుకోవచ్చు. దీనికి కంపెనీ వారంటీ సంవత్సరం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. అమెజాన్ బేసిక్స్ 142L డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ చెస్ట్ ఫ్రీజర్ (2022, కన్వర్టిబుల్, వైట్)

సౌకర్యవంతమైన చిన్న గదిలో పెట్టుకోగలిన ఫ్రిడ్జ్‌ ఇది. AmazonBasics 142L డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ చెస్ట్ ఫ్రీజర్ మీ అవసరాలకు అనువైనది. ఇది 142-లీటర్ల భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, మీ ఘనీభవించిన ఆహారాలు, పానీయాలు, ఐస్‌ కోసం అనుకూలంగా ఉంటుంది. ఫ్రీజర్ డైరెక్ట్-కూల్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది ఎక్కువ కాలం తాజాదనం, గడ్డకట్టడం కోసం ఉపకరణం అంతటా సమాన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. అలాగే, ఈ ఫ్రీజర్‌ను స్తంభింపచేసిన, రిఫ్రిజిరేటర్ మోడ్‌ల మధ్య అవసరమైన విధంగా మార్చవచ్చు. ఇది వివిధ అవసరాలకు పరిపూర్ణంగా ఉంటుంది. కెపాసిటీ: 142 ఎల్ రంగు: తెలుపు వోల్టేజ్: 220-240V ప్రత్యేక ఫీచర్: సూపర్ ఫ్రీజ్ ఫంక్షన్

4. హయెర్ 53 ఎల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్ (Haier 53 L Single door Mini Refrigerator )

హయెర్ 53 ఎల్ 2 స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ మినీ రిఫ్రిజిరేటర్ (మోడల్ HR-65KS) అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రొడక్టుకు సంవత్సరం వారెంటీ, కంప్రెజర్‌కు 5 సంవత్సరాల వారెంటీ ఉంటుంది. ఈ మినీ రిఫ్రిజిరేటర్ కెపాసిటీ 53 లీటర్లు. ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లో బాటిళ్లు, ఆహార పదార్థాలు సులువుగా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రీజర్ లాంటి చిల్లర్ జోన్ కూడా ఉంటుంది. ఈ హయెర్ మినీ రిఫ్రిజిరేటర్ ధర రూ.9,474గా ఉంది. ఈఎంఐ సదుపాయం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

5. ట్రోపికూల్ పోర్టా చిల్ బ్లాక్ 5 L కార్ రిఫ్రిజిరేటర్ చిల్లర్ కమ్ వార్మర్ (నలుపు)

అడాప్టబుల్ మరియు పోర్టబుల్ ట్రోపికూల్ పోర్టాచిల్ బ్లాక్ 5 L కార్ రిఫ్రిజిరేటర్ చిల్లర్ కమ్ వార్మర్ (నలుపు) వాహనాల్లో ఉపయోగం కోసం తయారు చేయబడింది. ఇది రోడ్డు ప్రయాణాలకు మరియు పిక్నిక్‌లకు సరైనది, ఎందుకంటే ఇది 5-లీటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు ఆహారం మరియు పానీయాలను చల్లబరచడానికి లేదా వేడి చేయడానికి ఉపయోగించవచ్చు. గాడ్జెట్ యొక్క చిన్న పరిమాణం దాని చుట్టూ తీసుకెళ్లడానికి మరియు నిల్వ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఇది కారులో సిగరెట్ తేలికైన ప్లగ్‌ని ఉపయోగించి శక్తిని పొందవచ్చు. లోపల ఉన్న ఏదైనా కారు దాని నలుపు రంగు పాలిష్‌తో మృదువుగా మరియు ఫ్యాషన్‌గా కనిపిస్తుంది. మొత్తంమీద, మొబైల్, సమర్థవంతమైన కూలింగ్ మరియు వార్మింగ్ సొల్యూషన్ కోసం శోధించే ఎవరికైనా Tropicool PortaChill ఒక అద్భుతమైన ఎంపిక. దీని ధర రూ 4,749 నుండి 5,300లోపుగానే లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్..