BYD Atto 3: టెస్లా కంటే చౌకైన సూపర్ కారు.. స్టైలిష్ ఫీచర్లు, బెస్ట్ మైలేజ్.. 521 కి.మీ నాన్‌స్టాప్‌ రైడింగ్‌..

సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ నుంచి కారు వరకు అన్నీ కూడా స్మార్ట్‌గా మారుతున్నాయ్..

BYD Atto 3: టెస్లా కంటే చౌకైన సూపర్ కారు.. స్టైలిష్ ఫీచర్లు, బెస్ట్ మైలేజ్.. 521 కి.మీ నాన్‌స్టాప్‌ రైడింగ్‌..
Car
Follow us

|

Updated on: Mar 24, 2023 | 7:09 PM

సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ నుంచి కారు వరకు అన్నీ కూడా స్మార్ట్‌గా మారుతున్నాయ్. ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరగింది. హైటెక్ ఫీచర్లతో సూపర్ కార్లు ప్రస్తుతం మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD నుంచి వస్తోన్న EV మోడల్‌ల్లో డ్రైవర్‌కు సహాయం చేయడానికి, అడ్డంకులను నివారించడానికి 360 డిగ్రీ కెమెరాలు, సెన్సార్‌లు వంటి కొత్త హైటెక్ ఫీచర్‌లు అమర్చబడి ఉన్నాయి.

ప్రస్తుతం UK మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన BYD మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ‘Atto 3’ ఈ వాహనానికి సంబంధించిన బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. కారు డెలివరీలు సైతం ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. షెన్‌జెన్-ఆధారిత వాహన తయారీదారు BYD తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మోడల్‌ను UKలో బ్రిటిష్ కార్ డీలర్‌షిప్‌ను పెండ్రాగన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

టెస్లా కంటే చౌక..

ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 36,000 పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 36 లక్షలు)గా నిర్ణయించారు. అయితే పెండ్రాగన్(Pendragon) సీఈఓ బిల్ బర్మన్ మాట్లాడుతూ.. ఫోర్డ్ ఫోకస్(Ford Focus) కంటే చౌకైన అంటే దాదాపు 20,000 పౌండ్లు(దాదాపు రూ. 20 లక్షలు)లో ఎలక్ట్రిక్ కారును మరికొన్ని రోజుల్లోనే యూకే మార్కెట్‌లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ BYD మోడల్‌లు టెస్లా కార్ల కంటే చౌకైనవి అని తెలుస్తోంది. టెస్లా కార్లు దాదాపు 50,000 పౌండ్ల నుంచి (సుమారు రూ. 50 లక్షలు) 1,00,000 పౌండ్ల(సుమారు రూ. 1 కోటి) వరకు ఉన్నాయి. అలాగే ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 521 కిలోమీటర్లు రయ్.. రయ్.. మంటూ వెళ్లిపోవచ్చు. కాగా, ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సులు, సైకిల్‌‌లతో పాటు ప్యాసింజర్ కార్లను తయారు చేసే గ్రేట్ వాల్ మోటార్, చెరీ లాంటి కంపెనీలతో యూకే మార్కెట్‌లోకి ప్రవేశించింది BYD సంస్థ. వీటిలో కెమెరాలు, సెన్సార్లు, రాడార్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.