AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.60 వేల పెట్టుబడితో ప్రతి నెలా రూ.14.5 లక్షల వడ్డీ! నమ్మలేని నిజం ఇది!

ఒక స్టాక్ మార్కెట్ ట్రేడర్ పంచుకున్న కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. 1990లో రూ.60,000తో కొన్న నాలుగు ఎకరాల భూమి, కాలక్రమేణా రూ.25 కోట్లుగా మారింది. డీమార్ట్ రెండు ఎకరాలను కొనుగోలు చేయగా, మిగిలిన భూమి అలాగే ఉంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పన్నులు, అదృష్టం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

రూ.60 వేల పెట్టుబడితో ప్రతి నెలా రూ.14.5 లక్షల వడ్డీ! నమ్మలేని నిజం ఇది!
Indian Currency 2
SN Pasha
|

Updated on: Mar 16, 2026 | 4:05 AM

Share

భూమి కొనుగోలు దీర్ఘకాలిక పెట్టుబడిగా ఎంత లాభదాయకంగా మారవచ్చో చూపించే ఒక ఆసక్తికర కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్‌ కొమ్మవర్‌ షేర్ చేసిన పోస్టులో తన మామ చేసిన భూమి పెట్టుబడి గురించి వివరించారు. ఈ కథ ఎక్స్‌లో విస్తృతంగా చర్చకు దారితీసింది. కొమ్మవర్ తెలిపిన వివరాల ప్రకారం.. 1990 ప్రాంతంలో ఆయన మామ తన స్వస్థలంలో నాలుగు ఎకరాల భూమిని ఎకరానికి రూ.15,000 చొప్పున కొనుగోలు చేశాడు. అంటే మొత్తం పెట్టుబడి కేవలం రూ.60,000 మాత్రమే. కాలక్రమేణా ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు తరువాత అది జిల్లా కేంద్రంగా కూడా మారింది.

ఈ అభివృద్ధి కారణంగా ఆ భూమి విలువ భారీగా పెరిగింది. చివరకు రిటైల్ రంగంలోని ప్రముఖ సంస్థ డీమార్ట్‌ ఆ భూమిలోని రెండు ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో చిన్న పెట్టుబడి భారీ సంపదగా మారిన ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. భూమి అమ్మకంతో వచ్చిన రూ.25 కోట్లను ఆయన మామ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పెట్టినట్లు తెలిపాడు. దాంతో నెలకు సుమారు రూ.14.5 లక్షల వరకు వడ్డీ ఆదాయం వస్తోంది. అదే సమయంలో మిగిలిన రెండు ఎకరాల భూమి ఇంకా ఆయన వద్దే ఉంది.

కొమ్మవర్ తన పోస్టులో కొన్ని సందర్భాల్లో సరైన ఆస్తిని దీర్ఘకాలం పాటు ఓపికగా ఉంచుకుంటే పెద్ద సంపద సృష్టించవచ్చని పేర్కొన్నారు. కొన్నిసార్లు దశాబ్దాల పాటు సరైన ఆస్తిని పట్టుకుని ఉండటం వల్లే పెద్ద సంపద ఏర్పడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కథ వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రూ.60 వేల పెట్టుబడి రూ.25 కోట్లుగా మారడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించగా, మరికొందరు ప్రతి భూమి ఇంత విలువ పెరగదు, ఇది ప్రాంతం, అదృష్టంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొంతమంది ఈ పెట్టుబడిపై పన్నులు ఎలా ఉంటాయనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గేయిన్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ) ఎంత చెల్లించాల్సి వచ్చిందో, అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై ఆదాయపు పన్ను, టీడీఎస్ వర్తించే అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఉదాహరణ దీర్ఘకాలిక పెట్టుబడిలో ఓపిక, సరైన నిర్ణయం ఎంత కీలకమో చూపించే కథగా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ