రెండు ఏనుగుల మధ్య భీకర పోరు.. అగ్గిపుల్లలుగా విరిగిన చెట్లు.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో వైరల్‌

రెండు ఏనుగులు ఒకదానితో ఒకటి తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఒకదానికి మించి ఒకటి తీవ్రమైన పోటీని ఇస్తున్నాయి. తగ్గేదేలే అంటూ రెండు ఏనుగులు ఢీ అంటే ఢీ అంటూ ఢీ కొంటున్నాయి. ఇదంతా దూరం నుంచే వీడియో తీశారు కొందరు పర్యాటకులు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండు ఏనుగుల మధ్య భీకర పోరు.. అగ్గిపుల్లలుగా విరిగిన చెట్లు.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో వైరల్‌
Elephant Fight
Follow us

|

Updated on: Mar 24, 2023 | 6:16 PM

ఏనుగు ప్రశాంతమైన అడవి జంతువు. ఏనుగు తెలివైనది. భావోద్వేగాలు అధికంగా కలిగిన జంతువు. సాటిలేని బలం కలిగినది. కానీ, ఏనుగుకు కోపం వస్తే..అడవి రాజు సింహం కూడా పరుగుతీయాల్సిందే. ఈ భారీ జంతువు వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. కొన్ని సందర్బాల్లో ఏనుగులు హైవేపై వెళ్తున్న వాహనాలను అడ్డుకోవటం, వెంబడించటం కూడా చేస్తుంటాయి. కొన్ని వీడియోల్లో అవి తమ పిల్లల కోసం అడవి జంతువులను, మనుషులను భయబ్రాంతులకు గురిచేస్తున్న సందర్భాలు కూడా అనేకం చూశాం. అయితే తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రెండు భారీ శరీరం కలిగిన ఏనుగుల భీకర పోరాటానికి సంబంధించినది. వీడియో చూస్తే మీరు కూడా అల్లాడిపోవాల్సిందే. రెండు ఏనుగుల పోరాటానికి మధ్యలో ఎవరైన వచ్చారంటే వారు నుజ్జు నుజ్జు కావాల్సిందే..! వైరల్‌గా మారిన ఈ వీడియో దక్షిణాఫ్రికాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న క్రుగర్ నేషనల్ పార్క్‌లోనిదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రెండు పెద్ద ఏనుగులు రోడ్డుపై పోరాడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. రెండు ఏనుగులు ఒకదానితో ఒకటి తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఒకదానికి మించి ఒకటి తీవ్రమైన పోటీని ఇస్తున్నాయి. అవి రెండు ఒక చెట్టుకు దగ్గరగా ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటూ ఆ చెట్టుకు చాలా దగ్గరగా వెళ్తాయి. ఇంతలో, ఒక ఏనుగు మరొకదానిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. రెండు ఏనుగులు కలిసి అక్కడే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాయి. దాంతో ఆ చెట్టు రెండుగా విరిగిపోయి నేలమీద కూలిపోయింది. దాంతో ఆ ఏనుగులు దూరంగా వచ్చేశాయి. దీంతోనే వీడియో పూర్తైంది. కానీ, ఈ పోరులో ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో మాత్రం తెలియలేదు. అయితే ఏనుగుల సత్తా చూసి.. వాటికి దూరంగా ఉండి జంగిల్ సఫారీ మ్యాన్ సరైన పనే చేశాడంటూ పలువురు నెటిజన్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

@SANParks అనే ట్విట్టర్ పేజీ ద్వారా మార్చి 23న వీడియో పోస్ట్ చేయబడింది. అతను క్యాప్షన్‌లో ఇలా రాశాడు – ఏనుగులు పోరాడినప్పుడు, గడ్డి, చెట్లు కూడా భారాన్ని భరిస్తాయి! ఈ క్లిప్‌కి ఇప్పటివరకు 20 వేలకు పైగా లైక్‌లు, చాలా మంది వినియోగదారులు దీనిపై ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. కొందరైతే చెట్టు అగ్గిపుల్లల విరిగిపోయిందంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..