50 కోట్ల రూపాయలతో బాస‌ర‌ ఆల‌య పునఃనిర్మాణానికి శ్రీకారం..గర్భాలయానికి ప్రత్యేకించి..

రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. దక్షిణ భారతదేశంలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు.

50 కోట్ల రూపాయలతో బాస‌ర‌ ఆల‌య పునఃనిర్మాణానికి శ్రీకారం..గర్భాలయానికి ప్రత్యేకించి..
Saraswathi Temple Reconstru
Follow us

|

Updated on: Mar 24, 2023 | 6:32 PM

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు అంకురార్పణ జ‌రిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రత్యేక పూజ‌లు నిర్వహించి, అమ్మవారి ఆల‌య పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాత: కాలంలో ముగ్గురు అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ అనంతరం గురు ప్రార్ధన గోపూజ, గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభించారు ఆలయ అర్చకులు.. కల్చస్థాపన రక్షాబంధనము మండపారాధన పుణ్యా వచనము, దీక్ష సంకల్పంతో , వాస్తు నవగ్రహ హోమము నిర్వహించారు. బాసర సరస్వతి అమ్మవారి గర్భాలయ పునః నిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డిలతో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఇప్పటికే రూ.8కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల్లో విశ్రాంతి భవనాలు, తదితర పనులు చేప‌ట్ట‌గా, రూ.22 కోట్లతో ప్రస్తుతం ఉన్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు.

దక్షిణ భారతదేశంలో ఒకటైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. ఈ కార్యక్ర‌మంలో ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి విజ‌యరామారావు, ఇత‌ర అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..