Hyderabad: బీ కేర్‌ఫుల్! గూగుల్‌లో ఇవి చూసినా, వెతికినా.. సరాసరి జైలుకే..

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన దగ్గర నుంచి.. యువత కూడా పెడదోవ పట్టడం ఎక్కువైపోయింది. ఈ తరుణంలో తెలంగాణ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Hyderabad: బీ కేర్‌ఫుల్! గూగుల్‌లో ఇవి చూసినా, వెతికినా.. సరాసరి జైలుకే..
Google
Follow us

|

Updated on: Mar 24, 2023 | 5:45 PM

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన దగ్గర నుంచి.. నిజాల కంటే అబద్దాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయ్. అలాగే యువత కూడా పెడదోవ పట్టడం ఎక్కువైపోయింది. ఈ తరుణంలో తెలంగాణ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. గూగుల్‌లో చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ కోసం వెతికినా.. చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా జైలుకెళ్లడం ఖాయం అని చెప్పారు. తమ వక్రబుద్ధిని మార్చుకోకుండా పదేపదే గూగల్‌లో ఈ కంటెంట్ కోసం వెతికితే.. చట్టం ముందు దోషిగా నిలబడటం తప్పదని హెచ్చరించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన కీలక విషయాలు ఆధారంగా బాలల లైంగిక వీడియోలను, ఫోటోలను సర్క్యులేట్ చేసేవారిపై నిఘా పెట్టారు పోలీసులు. నెల వ్యవధిలోనే 43 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 34 కేసులు దర్యాప్తులో ఉండగా.. 8 కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి.

మరోవైపు లాక్‌డౌన్ సమయంలో చైల్డ్ సెక్యువల్ అబ్యూజ్ కంటెంట్ 250 శాతం వరకు పెరిగిందని భారత సైబర్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ కంటెంట్ వైరల్ అవుతోన్న మాధ్యమాల్లో టెలిగ్రామ్ ఒకటి కాగా.. ఆయా కేసుల్లో ఎక్కువగా అరెస్ట్ అయినవారు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులే. ఈ కేసుల్లో అన్ని ఫోన్లు ఐపీ అడ్రెస్‌లు రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి పోలీసుల వరకు అందరికీ తెలుస్తాయని.. ఒకవేళ నేరం రుజువైతే.. ఏడేళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.