Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి.. కేవలం 7 గంటల్లోనే.. వందేభారత్ ప్రారంభం అప్పుడేనా!

శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది..

Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి.. కేవలం 7 గంటల్లోనే.. వందేభారత్ ప్రారంభం అప్పుడేనా!
Vande Bharat
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 24, 2023 | 8:06 PM

శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ నెలలో ఈ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్‌గ్రెడేషన్ పనుల ప్రారంభానికి వచ్చే నెలలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో వందేభారత్ రైలును సైతం జెండా ఊపి ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. అంతేకాకుండా.. ఈ రెండు నగరాలను కనెక్ట్ చేసేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉండగా.. మొదటిగా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ వెళ్లే రూట్‌లోనే వందేభారత్‌ను నడపనున్నారట. అంటే సికింద్రాబాద్‌ నుంచి బీబీనగర్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.

ఆ తర్వాత శావల్యపురం-ఒంగోలు రూట్ పూర్తయ్యాక.. అటు నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తిప్పనున్నారని సమాచారం. ఇక వందేభారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. 12 గంటలు కాస్తా.. ఇకపై ఆరున్నర గంటల నుంచి 7 గంటల ప్రయాణం అవుతుంది. కాగా, వందేభారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైచిలుక.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.

వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
వేడి కాఫీ లేదా కోల్డ్ కాఫీ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
అసెంబ్లీలో దుమ్ముదుమారమే.. సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
IPL 2025: వామ్మో ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి భయ్యా ఇంత భయంకరంగా ఉంది!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
కౌలుభూమిపై కన్నేసి.. తాగే నీళ్లలో పురుగు మందు కలిపి రైతు హత్య!
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
నేడు అప్పు జయంతి నీవు లేవు నీ దారిని విడవం అంటున్న ఫ్యాన్స్..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ విన్నర్! కేసు నమోదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ విన్నర్! కేసు నమోదు!
రాయుడు, సచిన్ మెరుపులు.. ఫైనల్లో ఇండియా మాస్టర్స్ విజయం!
రాయుడు, సచిన్ మెరుపులు.. ఫైనల్లో ఇండియా మాస్టర్స్ విజయం!
వాష్ రూమ్‌కు వెళ్లగా గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి భుసలు కొడు
వాష్ రూమ్‌కు వెళ్లగా గుండె ఆగినంత పనైంది.. కమోడ్ నుంచి భుసలు కొడు
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
మెగా వేలంలో ఛీ కొట్టారు.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి ధోని శిష్యుడు.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచార కేసులో చిక్కుకొని..