AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: శాస‌న‌మండ‌లిలో పెరిగిన వైసీపీ బలం.. 9 నుంచి 45కి చేరిన సంఖ్య..

Andhra Pradesh Assembly: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుతో శాస‌న‌మండ‌లిలో వైఎస్సార్ సీపీ బ‌లం బాగా పెరిగింది...గత సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కేవ‌లం 9 మంది ఎమ్మెల్సీల‌ను మాత్రమే క‌లిగి ఉన్న వైసీపీ బ‌లం 45 కు చేరింది.. దీంతో పూర్తిస్థాయిలో కౌన్సిల్ లో ప‌ట్టు సాధించింది వైసీపీ.

Andhra Pradesh: శాస‌న‌మండ‌లిలో పెరిగిన వైసీపీ బలం.. 9 నుంచి 45కి చేరిన సంఖ్య..
Andhra Pradesh Assembly
Shiva Prajapati
|

Updated on: Mar 24, 2023 | 7:04 PM

Share

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుతో శాస‌న‌మండ‌లిలో వైఎస్సార్ సీపీ బ‌లం బాగా పెరిగింది…గత సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కేవ‌లం 9 మంది ఎమ్మెల్సీల‌ను మాత్రమే క‌లిగి ఉన్న వైసీపీ బ‌లం 45 కు చేరింది.. దీంతో పూర్తిస్థాయిలో కౌన్సిల్ లో ప‌ట్టు సాధించింది వైసీపీ.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2019 లో అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో శాసన సభ ఆమోదం పొందిన బిల్లులు మండలిలో పాస్ కావడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు కౌన్సిల్ ఆమోదం పొందలేకపోయాయి. దీంతో కొన్ని కీలక నిర్ణయాల్లో ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి వచ్చింది.

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక సీట్ల గెలుపుతో వైసీపీ సభ్యుల బలం బాగా పెరిగింది. తాజాగా మొత్తం 21 స్థానాలకు వివిధ కోటాలో ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. టీచర్ల కోటాలో 2 స్థానాలు గెలుచుకోగా.. ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. దీంతో మొత్తం 17 మంది అభ్యర్థులు పెరిగారు. దీంతో మొత్తంగా మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య 45 కి చేరుకుంది. ఇక టీడీపీ కొత్తగా గెలుచుకున్న 4 స్థానాలతో ఆ పార్టీ బలం కేవలం 10కి పరిమితం కానుంది. పీడీఎఫ్ నుంచి మొత్తం ఐదుగురిలో ఇద్దరు స్థానం కోల్పోయారు. ఆగస్టులో గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి చేరనున్నాయి.

ఇవి కూడా చదవండి

కౌన్సిల్ లో బలం పెరగడంతో కీలక చట్టాల రూపకల్పనలో ప్రభుత్వానికి రూట్ క్లియర్ కానుంది.ఇక టీడీపీ,పీడీఎఫ్ బలం తగ్గడం తో పాటు బీజేపీ పూర్తిగా తన ప్రాతినిధ్యం కోల్పోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ