IGNOU Recruitment 2023: ఇగ్నోలో 200ల టైపిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. ఎంపికైతే నెలకు రూ.63,200ల జీతం

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో).. 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (నాన్‌ టీచింగ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు..

IGNOU Recruitment 2023: ఇగ్నోలో 200ల టైపిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. ఎంపికైతే నెలకు రూ.63,200ల జీతం
IGNOU New Delhi
Follow us

|

Updated on: Mar 23, 2023 | 9:07 PM

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో).. 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (నాన్‌ టీచింగ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 22, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు రూ.600 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 150 మార్కులకుగానూ 2 గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, మ్యాథమెటిక్స్‌ ఎబిలిటీ, హిందీ/ఇంగ్లిస్‌ కాంప్రహెన్షన్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంశాల్లో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.