Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తన నివాసంలో పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ను అరెస్టు చేయకుండా వైసీపీ

Seediri Appala Raju: వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని తన నివాసంలో పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనను అరెస్టు చేయకుండా వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పలరాజును అరెస్ట్ చేయవద్దంటూ వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు.
పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు అప్పలరాజును బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదం కేసు నుంచి కుమారుడిని తప్పించే ప్రయత్నం చేశారని అప్పలరాజుపై కేసు నమోదైంది. సాక్ష్యాలు తారుమారు చేశారని సీదిరిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ నిమిత్తం కాశీబుగ్గ పీఎష్‌కు తరలించారు పోలీసులు. ఇప్పటికే ఆయన కుమారుడు ఆరవ్ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు సీదిరి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
