AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ‘ధురంధర్’ లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది

కొన్ని రోజుల క్రితం విడుదలైన ధురంధర్ , ధురంధర్ ది రివేంజ్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కథతోనే తెరకెక్కిన ఓ వెబ్ సిరీస్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది.

OTT Movie: ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. టాప్ ట్రెండింగ్‌లో రియల్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 22, 2026 | 7:33 PM

Share

ఇటీవల వచ్చిన ‘దురంధర్’ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో మన హీరో పాకిస్తాన్ వెళ్లి అక్కడి టెర్రరిస్టులను ఎలా మట్టుపెట్టాడో చూసి పిచ్చెక్కిపోయాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే వెబ్ సిరీస్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కింది. దేశం కోసం తన గుర్తింపును, ప్రేమను, జీవితాన్ని త్యాగం చేసిన ఓ యువకుడి కథను ఈ వెబ్ సిరీస్ ప్రతిబింబిస్తుంది. అందులోనూ కొన్ని వాస్త వ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. దీంతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ కు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. హిందీతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం సినిమాల్లో కనిపించకుండా కాంట్రవర్సీ విషయాలు, పోస్టులతో వార్తల్లో నిలుస్తోన్న ప్రకాష్ రాజ్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. 1962 చైనా-భారత్ యుద్ధం తర్వాతి కాలంలో ఈ కథ ప్రారంమవుతుంది. అప్పటికే భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది. ఇదే సరైన సమయమని భావించి, పాకిస్తాన్ భారతదేశంపై రహస్యంగా దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది.

ఈ ప్రమాదాన్ని పసిగట్టిన భారత ఇంటెలిజెన్స్ విభాగం మాటలతో నమ్మించగల కమ్రాన్ బక్ష్ అనే ఒక చిన్న స్థాయి దొంగకు శిక్షణ ఇచ్చి హర్ఫాన్ప పేరుతో పాకిస్తాన్‌లోని లాహోర్‌కు పంపుతారు. హర్ఫాన్ తన తెలివితేటలతో పాకిస్తాన్ మిలిటరీ హైకమాండ్‌కు దగ్గరవుతాడు. అదే సమయంలో జమీలా అనే స్థానిక జర్నలిస్ట్ కుమార్తెతో ప్రేమలో పడతాడు. అయితే క్రమంగా పరిస్థితులు హర్ఫాన్ కు ప్రతికూలంగా మారుతాయి? మరి ఆ తర్వాత ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ మలోయ్ కృష్ణ ధర్ రాసిన ‘మిషన్ టు పాకిస్తాన్’ నవల ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ పేరు ‘ముఖ్బీర్ ది స్టోరీ ఆఫ్ ఎ స్పై’ (Mukhbir The Story of a Spy). ప్రస్తుతం ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?