Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Paper Leak: అసలు నేరస్థులకు కాపాడేందుకే.. పీసీసీ అధ్యక్షుడిని సిట్ కార్యాలయానికి పిలిచారు: భట్టి విక్రమార్క

ఆసిఫాబాద్ జిల్లాలో పిప్పిరి గ్రామం నుంచి మొదలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 123 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసింది. TSPSC పేపర్ల లీకేజీపై ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలవడాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు.

TSPSC Paper Leak: అసలు నేరస్థులకు కాపాడేందుకే.. పీసీసీ అధ్యక్షుడిని సిట్ కార్యాలయానికి పిలిచారు: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka
Follow us
Venkata Chari

|

Updated on: Mar 24, 2023 | 5:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో పిప్పిరి గ్రామం నుంచి మొదలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 123 కిలోమీటర్ల మేర పాదయాత్ర ముగిసింది. TSPSC పేపర్ల లీకేజీపై ప్రశ్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలవడాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ఏదైన సమాచారం కావాలంటే దర్యాప్తు అధికారులు వారి ఇళ్లకు వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు. పీసీసీ అధ్యక్షుడిని సిట్ కార్యాలయానికి పిలిపించడం అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అసలు నేరస్థులకు కాపాడడమే అని అన్నారు భట్టి. జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపడం కోసమే రేవంత్‌ రెడ్డిని పిలిపించినట్లు అనిపిస్తోందన్నారు.

ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నాయకులను భయపెట్టేలా, వారి గొంతు నులిమేలా చేయడం నియంతృత్వల పోకడలకు నిదర్శనమని అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సర్వసాధారణం అన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యలు చేసిన ఇంద్రకరణ్ రెడ్డి లాంటివారు మంత్రి వర్గంలో ఉండటం సిగ్గుచేటన్నారు. సిట్ అధికారుల బెదిరింపులకు లొంగేది లేదన్న భట్టి విక్రమార్క.. విద్యార్థుల కోసం పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు.

ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్స్ చైర్మన్, సెక్రటరీలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు చేసిన పోరాట ఫలితంగానే సీఎం కేసీఆర్ పంటల పరిశీలనకు వెళ్లారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క సీజన్‌లో కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ పంట నష్ట పరిశీలన చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లుగా పంట నష్టపరిహారం ఇవ్వని మీ పాలన ఇక చాలంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు భట్టి విక్రమార్క.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..