Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న గ్రామ సింహలు.. కుక్క గాట్లతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.

వీధుల్లో తిరుగుతూ దడపుట్టిస్తున్న గ్రామ సింహలు.. కుక్క గాట్లతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
Stray Dogs
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 24, 2023 | 8:30 PM

కుక్కంటే విశ్వాసానికి మారు పేరు.. కానీ ఆ కుక్కలు రోడ్డు మీద కనిపడితే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగడం లేదు. వీధి మారుతోంది. ఊరు వేరవుతోంది. కానీ కుక్కల దాడులు మాత్రం కామన్. ఇటీవల కుక్కల దాడి ఘటనలు వినని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం ఎక్కడో చోట పిల్లలనూ, పెద్దలనూ కుక్కలు పీకి పెడుతున్నాయి. గ్రామ సింహాలు మళ్లీమళ్లీ పంజా విసురుతూ.. నిలువునా ప్రాణాలు తోడేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఇప్పుడు కుక్కల పేరు చెప్తేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీధి కుక్కల దాడి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఆస్పత్రిపాలయ్యేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.

తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. శ్రీనివాసనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బాలాజీ, కీర్తన దంపతులకు కరీష్ రాజ్ అనే మూడు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. మద్యాహ్న సమయంలో ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. ఓ వీధి కుక్క హఠాత్తుగా వచ్చి ఆ చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. తల, ముఖం, భుజం, పొట్ట భాగాలను పట్టి పీకేసిందా కుక్క.

విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాకలో వీధి కుక్కల వీరంగం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న కుక్కలు.. వీధిలో ఒంటరిగా తిరిగే వారి పిక్క పట్టి పీకేస్తున్నాయి. ఈశ్వరమ్మ అనే మహిళపై కుక్కల గుంపు దాడి చేయడంతో.. తీవ్రగాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతినగర్‌లోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఆడుకుంటున్న వరుణ్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఆ బాలుడిని ముందుగా మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

రంగా రెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్‌లో వీధికుక్కలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులే టార్గెట్‌గా అటాక్ చేస్తున్నాయి. కేశవ రెడ్డి కమిటీ హల్ దగ్గర ఓ బాబుపై కుక్కలు దాడి చేశాయి. పిల్లలు, పెద్దలు అని తేడా లేదు. రాత్రి, పగలు అని భేదం లేదు. బయట మనిషి కనిపిస్తే చాలు కరిచిపడేస్తున్నాయి. కుక్కలు పగబట్టినట్లే ప్రవర్తిస్తున్నాయి. స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే చిన్నారులు మొదలుకుని మహిళలు, వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కురుస్తున్నాయి.

వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒకచోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రోజూ పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఈ బాధితులు కనిపిస్తున్నారు. వీధి కుక్కలపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.

మరిన్ని ఏపీ, తెలంగాణ వార్తల కోసం..