AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. ఆ తప్పే అతన్ని పట్టించింది..

భార్యను చంపి బెడ్‌ రూంలో మంచం కింద దాచాడో భర్త. అనంతరం ఏమీ తెలియనట్లు మొసలి కన్నీళ్లు కార్చి భర్యా కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అదే అతని కొంప ముంచింది. ఈ షాకింగ్‌ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన..

భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. ఆ తప్పే అతన్ని పట్టించింది..
Kerala Teacher Murder Case
Srilakshmi C
|

Updated on: Mar 26, 2023 | 6:20 PM

Share

భార్యను చంపి బెడ్‌ రూంలో మంచం కింద దాచాడో భర్త. అనంతరం ఏమీ తెలియనట్లు మొసలి కన్నీళ్లు కార్చి భర్యా కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అదే అతని కొంప ముంచింది. ఈ షాకింగ్‌ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇడుక్కిలోని కంచియార్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అనుమోల్, బిజేష్‌ దంపతులు. ఏం జరిగిందో తెలియదుగానీ గత మంగళవారం (మార్చి 21) బిజేష్ భార్యను హత్య చేసి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి ఇంట్లో మంచం కింద దాచాడు. అనంతరం భార్య కనిపించడం లేదంటూ బిజేష్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టాడు. బిజేష్ కూడా గత ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో పోలీసులకు అతనిపై అనుమానం తలెత్తింది. హత్యానంతరం కట్టప్పన బెవరేజీ ఔట్‌లెట్‌ సమీపంలో తన భార్య ఫోన్‌ను మరొకరికి విక్రయించినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

దీంతో కుమలి సీఐ నేతృత్వంలోని బృందం పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతంలో బిజేష్‌ను అదుపులోకి తీసుకుని కట్టపనకు తరలించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. భార్య అనుమోలేను ఈ నెల 21వ తేదీన హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలను కనుగొనేందుకు నిందితుడిని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి