AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. వరుసగా రెండో సారి స్వర్ణ పతకం.. భారత్ ఖాతాలో మూడో గోల్డ్ మెడల్..

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. 50కిలోల బాక్సింగ్‌ విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం సాధించింది. ఇందుకోసం ఆమె..

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. వరుసగా రెండో సారి స్వర్ణ పతకం.. భారత్ ఖాతాలో మూడో గోల్డ్ మెడల్..
Nikhat Zareen
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 26, 2023 | 7:06 PM

Share

ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం వచ్చింది. సీనియర్ బాక్సింగ్‌(48-50 కేజీలు) విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతాకం సాధించింది. అంతేకాక సీనియర్ విభాగంలో భారత మాజీ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ చరిత్ర సృష్టించింది. ఇందుకోసం ఆమె ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో 5-0 తేడాతో వియత్నాం బాక్సర్‌ న్యూయెన్ టి తామ్‌పై విజయం సాధించింది.

ఇంకా, గతేడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా నిఖత్ గోల్డ్ మెడల్ సాధించింది. అప్పుడు కూడా ఆమె 5-0 తేడాతోనే నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌నాల్‌ని ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా భారత్ తరఫున సీనియర్ బాక్సింగ్‌లో మేరికోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు గోల్డ్ మెడల్ సాధించిన రెండో ప్లేయర్‌గా.. అలాగే వరుసగా రెండో ఏడాది కూడా స్వర్ణపతాకం సాధించిన రెండో బాక్సర్‌గా నిఖత్‌ చరిత్ర పుటల్లో నిలిచింది. మరోవైపు బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా కూడా నిఖత్ జరీన్ రికార్డు సృష్టించింది.

కాగా, శనివారం జరిగిన ఫైనల్స్‌లో కూడా భారత్‌ రెండు బంగారు పతకాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 48 కేజీల విభాగం నీతు గాంగాస్‌ 5-0 తేడాతో లుత్సాయి ఖాన్‌ (మంగోలియా)ను నెల కరిపించగా.. 81 కేజీల విభాగం టైటిల్‌ పోరులో స్వీటీ బూర 4-3 తేడాతో వాంగ్‌ లీనా (చైనా)పై పోరాడి గెలిచింది. దీంతో ఈ ఏడాది భారత్ ఖాతాలో 3 బాక్సింగ్ గోల్డ్ మెడల్స్ చేరాయి.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి