No Smoking: మీలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? వెంటనే స్మోకింగ్ మానేయకపోతే డాక్టర్లు కూడా మిమ్మల్ని కాపాడలేరు..!

ధూమపానం వల్ల నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సహా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం నూటికి 90 శాతం ఉంది. ఈ విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అయినా కూడా చాలా మంది..

No Smoking: మీలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? వెంటనే స్మోకింగ్ మానేయకపోతే డాక్టర్లు కూడా మిమ్మల్ని కాపాడలేరు..!
Quit Smoking
Follow us

|

Updated on: Mar 26, 2023 | 4:37 PM

ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం మన ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాక ప్రాణాంతకమని తెలిసినా కూడా అధిక శాతం మంది దానిని పట్టించుకోరు. ధూమపానం వల్ల నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సహా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం నూటికి 90 శాతం ఉంది. ఈ విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అయినా కూడా చాలా మంది తమకు ఏమీ పట్టనట్టు గుప్పుగుప్పున పొగ లాగుతూ తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటారు. ఈ క్రమంలో మన శరీరంపై ధూమపానం ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనలో కొన్ని రకాల హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే ధూమపానం మానేయాలి. లేకపోతే ప్రాణాలను కాపాడడం వైద్యుల తరం కూడా కాదని వారే స్వయంగా చెబుతున్నారు. మరి ధూమపానం ప్రభావంతో శరీరంలో కనిపించే సంకేతాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దీర్ఘకాలిక దగ్గు: ధూమపానం మితిమీరి దానిని మానేయాల్సిన సమయంలో ఆసన్నమైనప్పుడు.. శరీరంలో అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతాలలో దీర్ఘకాలిక దగ్గు ఒకటి. దీర్ఘకాలికంగా దగ్గుతో ఉంటే, అది ధూమపానం కారణంగా కలిగిన చెడు ప్రభావమే. ముఖ్యంగా ఉదయం పూట, సిగరెట్ పొగ నుంచి విషాన్ని తొలగించడానికి మీ ఊపిరితిత్తులు కష్టపడుతున్నాయని దాని అర్థం కావచ్చు. కాలక్రమేణా ఇది దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక దగ్గు సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే ధూమపానానికి స్వస్తి పలకండి.

శ్వాస సమస్యలు: ఏదైనా చిన్నపాటి శారీరక శ్రమ చేసినా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అయితే ఇది ధూమపానం కారణంగా శరీరంలో కనిపించిన హెచ్చరిక సంకేతమే. వెంటనే మీరు ధూమపానానికి చెక్ పెట్టకపోతే..ఇది మీక ఊపిరి ఆడకపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే సిగరెట్ పొగ ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి శ్వాస సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే ధూమపానానికి స్వస్తి పలకండి.

ఇవి కూడా చదవండి

రుచి, వాసన తెలియకపోవడం: పొగతాగడం వల్ల కూడా మీరు వాసన, రుచిని కోల్పోతారు . మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు తిన్నప్పటికీ కూడా మునుపటిలా వాటి రుచిని మీరు ఆస్వాదించలేరు, గ్రహించలేరు. వాసన సరిగ్గా రావడం లేదని మీరు గ్రహించినట్లయితే, అది ధూమపానం వలన ఏర్పడిన దుష్ప్రభావమే. కాబట్టి మీరు వెంటనే సిగరెట్ మానేయాలి.

నోటి సమస్యలు: సిగరెట్, పొగాకు ఉత్పత్తుల పొగలో అనేక రసాయనాలు ఉంటాయి. ఇవి కాలక్రమేణా మీ దంతాల సహజ రంగును మారుస్తాయి. ఇంకా మీ నోటి ఆరోగ్యం, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు మీ చేతులు కూడా సహజత్వాన్ని కోల్పోతాయి. మీరు మీ దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయని గమనిస్తే, ధూమపానం మానేయడానికి ఇది సమయం కావచ్చు.

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు: ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉంది. మీరు ఇలాంటి వ్యాధుల చరిత్రను కలిగి ఉంటే లేదా మీ కుటుంబంలో ఇదివరకే ఇలాంటి సమస్యలు ఉంటే , అది ఇంకా మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి వీలైనంత త్వరగా ధూమపానం మానేయడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్