Memory Booster: చిన్నచిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా..? అయితే మీకు ఇవి అవసరమే..

విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరిలోనూ కనిపించే లక్షణాలు.. మితిమీరిన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర పని భారం. ఈ రకమైన అలవాట్లు లేదా లక్షణాలు మన ఆరోగ్యానికి హాని కలిగించడమే కాక మానసిన, జ్ఞాపకశక్తిని కూడా..

Memory Booster: చిన్నచిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా..? అయితే మీకు ఇవి అవసరమే..
Memory Boosters
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 26, 2023 | 4:11 PM

ఇటీవలి కాలంలో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరిలోనూ కనిపించే లక్షణాలు.. మితిమీరిన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర పని భారం. ఈ రకమైన అలవాట్లు లేదా లక్షణాలు మన ఆరోగ్యానికి హాని కలిగించడమే కాక మానసిన, జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తాయి. ఫలితంగా చీటికీమాటికీ విసిగించుకోవడం, ప్రతిదీ వెంటనే మరిచిపోవడం వంటివి చేస్తుంటాం. అలాంటి సందర్భాలలో అనేక మంది ముందు నవ్వుల పాలు కూడా కావలసి వస్తుంది. ఈ క్రమంలోనే తమ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, ఇంకా దానికి మూలమైన ఒత్తిడిని జయించేందుకు చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల చికిత్సలను కూడా తీసుకుంటారు. కానీ నిజానికి వాటిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పని మధ్య విరామం తీసుకోవడం వంటివి చేయాలి. ఇంకా వాటితోనే సరిపెట్టుకోకుండా శరీరానికి అవసరమైన కొన్ని రకాల పోషకాలతో కూడా సమతుల్య ఆహారాన్ని కూడా తీసుకోవాలి.  ఇటువంటి పోషకాహారాన్ని నిత్యం తీసుకుంటే మతిమరుపు, ఒత్తిడి, ఇతర ఆరోగ్య సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. మరి ఈ క్రమంలో మీరు తీసుకోవలసిన ఆహారాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

విటమిన్ సి: శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ సి ప్రముఖమైనది. ఇది మనలోని ఒత్తిడిని తగ్గించడమే కాక మన ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరుస్తుంది. ముఖ్యంగా మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక విటమిన్ సి కోంస గుడ్లు, మొలకలు, సిట్రస్ పండ్లు, బ్రోకలీ, బంగాళదుంపలు, స్ట్రాబెర్రీలు, కివి, ఎర్ర మిరియాలు, క్యాబేజీ, ఆకుకూరలు వంటి ఆహారాలను తీసుకోవాలి.

విటమిన్ ఇ: డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, తృణధాన్యాలు, వాల్‌నట్ ఆయిల్, గోధుమ గింజలు, మొలకల వంటి వాటిలో లభించే విటమిన్ ఇని మీరు సహజంగా కూడా తీసుకోవచ్చు. దీనితో మీలోని ఒత్తిడి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మెగ్నీషియం: మెగ్నీషియం ఉన్న ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందుకోసం మీరు మీ ఆహారంలో ఆపిల్, సెలెరీ, చెర్రీస్, అత్తి పండ్లను, కూరగాయలు, బొప్పాయి, బఠానీలు, ఎండుద్రాక్ష, బంగాళదుంపలు, ఆకుపచ్చ ఆకులు,వాల్‌నట్స్‌ను చేర్చుకోవాలి.

విటమిన్ B12: విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలలో పాలు, చికెన్, గుడ్లు, చేపలు ఉంటాయి.

లెసిథిన్: లెసిథిన్ సహజ వనరులలో గుడ్డు సొనలు, బాదం, నువ్వులు, సోయాబీన్స్, తృణధాన్యాలు, గోధుమలు ప్రధానమైనవి. ఇవి మీలోని మతిమరుపు, ఒత్తిడిని నివారించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కల్సిస్తాయి.

ఫ్లేవనాయిడ్స్:  ఆరోగ్యానికి మేలుదాయకమైన ఫ్లేవనాయిడ్స్‌ను పొందాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో ఉల్లిపాయ, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, టర్నిప్ వంటివాటిని చేర్చుకోవచ్చు. ఇవే కాకుండా మీరు నారింజ పండ్లు, మిరపకాయలు, బీన్ మొలకలు కూడా తినవచ్చు.

కెరోటినాయిడ్స్: కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉండే క్యారెట్, మొలకలు, చిలగడదుంపలు, బచ్చలికూర, పాలకూర, ఎర్ర మిరియాలు, టొమాటోలు, నారింజ వంటి పండ్లను మీరు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో మతిమరుపుకు చెక్ పెట్టడమే కాక మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..