AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Transit 2023: మేషరాశిలోకి గ్రహాల రాజు.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనయోగం.. శత్రువులపై విజయం..

నవగ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తూ మరో రాశిలోని ప్రవేశిస్తుంటాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న సూర్యభగవానుడు ఏప్రిల్‌లో తన రాశిని మార్చనున్నాడు. మార్చి 15న ఉదయం 6.47 గంటలకు మీనరాశిలో..

Sun Transit 2023: మేషరాశిలోకి గ్రహాల రాజు.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనయోగం.. శత్రువులపై విజయం..
Sun Transit To Aries
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 25, 2023 | 6:50 PM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తూ మరో రాశిలోని ప్రవేశిస్తుంటాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న సూర్యభగవానుడు ఏప్రిల్‌లో తన రాశిని మార్చనున్నాడు. మార్చి 15న ఉదయం 6.47 గంటలకు మీనరాశిలో ప్రవేశించిన ఆదిత్యుడు ఏప్రిల్ 14న అంటే శుక్రవారం మధ్యాహ్నం 02:42 గంటలకు మీనరాశిని విడిచి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక సూర్యభగవానుడి రాశిమార్పు రాశిచక్రంలోని 12 రాశులపై తనదైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రమంలోనే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు శుభప్రదంగా, అలాగే మరికొన్ని రాశులకు అశుభంగా ఉండనుంది. అలాగే కొందరి జీవితాల్లో పెను మార్పులు అంటే ఆర్థిక రాబడి, వ్యాపార లాభాలు, ఉద్యోగప్రాప్తి, ఆకస్మిక ధనయోగం కూడా చోటుచేసుకోబోతున్నాయి. మరి ఆ రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశిలోకి సూర్యుని ప్రవేశం ఈ రాశులకు శుభప్రదం..

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఈ సంచారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరు ఆర్థిక ప్రయోజనం పొందటంతో పాటు వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వీరు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారికి ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది.

సింహ రాశి: సూర్య సంచారం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశివారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కెరీర్‌లో పురోగతి, ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

మేష రాశి: మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి బాధ్యతలు పెరుగతాయి. కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. ఆర్థిక స్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది.

మిథున రాశి: మిథునరాశి వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను అందించనుంది. వీరు అన్ని రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. వీరి శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీ లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్లే  అవకాశం ఉంది. లవ్ లైవ్ బాగుంటుంది.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి మేషరాశిలో సూర్య గోచారం లాభాలను ఇస్తుంది. వీరు చేసే చిన్న చిన్న పనులుకు కూడా ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో వీరు రుణ విముక్తి పొందడంతో పాటు లాభాలను గడిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యం కూడా పెరుగుతుంది.

ధనుస్సు రాశి:  మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారు తమ రీర్‌లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారులు భారీగా లాభపడటంతో పాటు పెద్దమొత్తంలో వెనకేసుకుంటారు. ఈ సమయంలో ధనస్సు రావివారు తమ శత్రువులపై కూడా విజయం సాధిస్తారు.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)