Weekly Horoscope: ఆ రాశుల వారికి గుడ్ న్యూస్.. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

వారం అంతా ఆనందదాయకంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

Weekly Horoscope: ఆ రాశుల వారికి గుడ్ న్యూస్.. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..
HoroscopeImage Credit source: TV9 Telugu
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 26, 2023 | 7:00 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశి వారికి ఈ వారం మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు భారీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ వారం ఈ రాశి వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని పొదుపు పాటించడం కూడా అవసరం. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం సొంత ఊరులోనే లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం పట్ల కొద్దిగా ఆసక్తి తగ్గుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

నవమ రాశిలో శని, పదవ రాశిలో గురువు, పదకొండవ రాశిలో రాహు సంచారం వల్ల ఈ రాశి వారు ఈ వారం ఉద్యోగ పరంగా మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా సానుకూలమైన మార్పు కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా చక్కబడతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. వృత్తులకు సంబంధించిన వారు క్షణం కూడా తీరికలేని పరిస్థితికి చేరుకుంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వ్యాపారంలోను, ఉద్యోగంలోనూ మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు, చికాకులు ఎదురవుతున్నప్పటికీ పట్టుదలగా ముందుకు దూసుకుపోతారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరమని అర్థం చేసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ ఉత్తర 1)

ఈ వారం అంతా ఈ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలలో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బాగా సన్నిహితుల సహకారంతో కొత్త వ్యాపారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు కొందరు మీ సలహాలను తీసుకుని ప్రయోజనం పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి మాటలకు దారితీస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అవరోధాలు ఎదురైనా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇతర వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధువులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. రుణ దాతల దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. బాగా దగ్గర బంధువుల నుంచి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక ఉండదు. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తిచేస్తారు. ఇరుగుపొరుగు వారితో తగాదా పడే సూచనలున్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

దూర ప్రాంతం నుంచి శుభవార్త ఒకటి అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలలో మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో అలవి కాని లక్ష్యాలను అప్పగిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదృష్ట యోగం పడుతుంది. ఇక రాదని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఈ రాశి వారికి స్థానచలనం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం కుటుంబ సభ్యులంతా ఒక చోట కలుసుకునే అవకాశం ఉంది. వారమంతా ఉత్సాహంగా, సరదాగా గడిచిపోతుంది. ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. వివిధ వృత్తుల వారికి కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వారం అంతా ఆనందదాయకంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా భారీ ఇంక్రిమెంట్ కు అవకాశం ఉంది. ఇతర సంస్థలకు మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. బంధువులు గానీ, కొందరు మిత్రులు గానీ అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చాలావరకు లాభాల బాటలో నడుస్తాయి. ఐటి నిపుణులకు మంచి పురోగతి కనిపిస్తోంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం అంతా దాదాపు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది, ఒక మంచి శుభ పరిణామం చోటుచేసుకుని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధు వర్గం నుంచి ఒక మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు సన్నిహితులకు సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం అనుభవానికి వస్తుంది. వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు