Telugu News Sports News Cricket news WPL 2023 Final: Delhi Capitals vs Mumbai Indians here is all you need to know about the Women's Premier League final
WPL 2023 Final: రేపే డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ట్రోఫీ కోసం తలపడనున్న ముంబై, ఢిల్లీ జట్లు.. ఎక్కడ, ఎలా చూడాలంటే..?
ఆదివారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. లీగ్ రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా..
WPL 2023 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఆరంభ సీజన్ ఫైనల్‌కు సర్వంసిద్ధమైంది. మార్చి 26 అంటే ఆదివారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. లీగ్ రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఢిల్లీ తర్వాత పాయింట్ల పట్టికలో 2, 3 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడగా.. ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.
ఫలితంగా డబ్ల్యూపీఎల్ తొలి ట్రోఫీ కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్, మెగ్ లానింగ్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ నాయకత్వం వహిస్తుండగా, భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫైనల్ డబ్ల్యూపీఎల్ ట్రోఫీ కోసమా..? లేక టీమిండియా-ఆసీస్ జట్టు కెప్టెన్ల సామర్థ్యం నిరూపించుకోవడానికా..? అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
The two skippers are ready to fight for the trophy ??
కాగా, లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అంటే లీగ్‌లో రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు డబ్య్లూపీఎల్ ఫైనల్ కూడా సమబలం కలిగిన ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుండడంతో.. ప్రపంచ క్రికెట్ అభిమానులలో ట్రోఫీ ఎవరి సొంతమవుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ Sports18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అలాగే మీరు Jio సినిమా యాప్, వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమ్‌ను ఉచితంగా చూడవచ్చు.