IPL 2023: ఐపీఎల్‌లో అందరి కళ్లు వీరిపైనే.. లిస్టులో ధోని శిష్యులు.. మరో ముగ్గురు!
ఐపీఎల్ 16వ సీజన్ కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 31వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఛాంపియన్‌గా..
ఐపీఎల్ 16వ సీజన్ కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 31వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా తొలి పోరు జరగనుంది. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పలువురు యువ ప్లేయర్స్ తొలిసారిగా భాగం కానున్నారు. అయితేనేం ఈసారి మాత్రం ఎక్కువగా ఆల్‌రౌండర్లపైనే అందరి చూపు ఉంది. అటు బ్యాట్‌తోనే కాదు.. ఇటు బంతితోనూ వీరు క్షణాల్లో మ్యాచ్ మలుపు తిప్పుతారు. మరి ఐపీఎల్ 16వ సీజన్‌లో అందరి చూపు తమ వైపు తిప్పుకునే ఆల్‌రౌండర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..
-
హార్దిక్ పాండ్యా:
గతేడాది గుజరాత్ టైటాన్స్ సారధిగా బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా.. ఆ జట్టు తరపున బ్యాట్‌తో 487 పరుగులు, బంతితో 8 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఫైనల్‌లో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడమే కాకుండా.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈసారి అందరి దృష్టి హార్దిక్‌పై పడింది.
-
రవీంద్ర జడేజా:
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రవీంద్ర జడేజా.. ఆ జట్టుకు 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే అందించగలిగాడు. అంతేకాదు ఆల్‌రౌండర్‌గా కూడా పూర్తిగా విఫలమై.. బ్యాట్‌తో 19 పరుగులు, బంతితో 5 వికెట్లు తీశాడు. అయితే గత ఆస్ట్రేలియా సిరీస్‌లో జడ్డూ తన ఫామ్‌ను తిరిగి పుంజుకోవడంతో.. అందరి కళ్లు ఇప్పుడు జడేజా వైపే.
-
కామరాన్ గ్రీన్:
ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏకంగా రూ. 17.5 కోట్లకు అమ్ముడయ్యాడు ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్. ముంబై ఇండియన్స్ ఈ రైట్ ఆర్మ్ బ్యాటర్‌ను కొనుగోలు చేసింది. భారత్‌తో జరిగిన సిరీస్‌ల్లో గ్రీన్ అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లో ఈ ఫినిషర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
-
బెన్ స్టోక్స్:
మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 16.5 కోట్లకు బెన్ స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. ధోని తర్వాత సీఎస్కే పగ్గాలు సైతం స్టోక్స్‌కే అప్పగిస్తారని టాక్ నడుస్తోంది.
మరి ఈ లీగ్‌లో బెన్ స్టోక్స్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. అలాగే వీరితో పాటు రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్‌లపై ఆయా ఫ్రాంచైజీలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాయి.