AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ చేసిన తప్పిదం.. భారీ రికార్డు మిస్సయిన సెహ్వాగ్.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే?

విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఫార్మాట్ ఏదైనా..

Virat Kohli: కోహ్లీ చేసిన తప్పిదం.. భారీ రికార్డు మిస్సయిన సెహ్వాగ్.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే?
Sehwag
Ravi Kiran
|

Updated on: Mar 25, 2023 | 8:21 PM

Share

విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా ఫార్మాట్ ఏదైనా.. బరిలోకి దిగితే.. ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు సెహ్వాగ్. బ్యాట్‌తోనే కాదు.. అప్పుడప్పుడూ హాఫ్ స్పిన్ బౌలింగ్‌తో మ్యాజిక్ చేస్తుంటాడు వీరేంద్రుడు. బంతితో అతడు టీమిండియాకు పలుసార్లు అద్భుతమైన విజయాలను సైతం అందించాడు. అయితే విరాట్ కోహ్లీ చేసిన చిన్న తప్పిదంతో బౌలింగ్‌లో ఒక గొప్ప మైలురాయిని అందుకోలేకపోయాడట సెహ్వాగ్. మరి అదేంటో తెలుసుకుందామా..

భారత్ తరఫున 251 వన్డేలు ఆడిన సెహ్వాగ్ 96 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, ఈ ఆటగాడు టెస్టుల్లో 104 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు తీశాడు. ఇక టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సెహ్వాగ్ తన బౌలింగ్‌తో ఎందరో బడా బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఇటీవల బీర్‌బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ తన బౌలింగ్‌లో రికీ పాంటింగ్, మైకేల్ హస్సీ, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, తిలకరత్నే దిల్షాన్, బ్రియాన్ లారా వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశానని తెలిపారు. అలాగే ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను కూడా పెవిలియన్ పంపించానని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో అతడు విరాట్ కోహ్లీ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుర్తు చేసుకున్నాడు సెహ్వాగ్.

విరాట్ కోహ్లీ ఒకసారి ఒక మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో మిడ్ వికెట్ వద్ద చాలా సులభమైన క్యాచ్‌ను వదిలేశాడు. దానితో ఓ అపురూపమైన రికార్డు కోల్పోయాను. ఆ సమయంలో అతడిపై కోప్పడ్డానని స్పష్టం చేశాడు. కాగా, ఇంటర్వ్యూ చివర్లో కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు సెహ్వాగ్. అతడు ఇంత ఎత్తుకు ఎదుగుతాడని అస్సలు ఊహించలేదు. కోహ్లీ 70-75 సెంచరీలు అలాగే 25 వేల పరుగులు చేస్తాడని తాను అనుకోలేదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..