AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL Final: ఆఖరి పోరుకు సిద్ధమైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు?

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ టైటిల్ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ XI మారే అవకాశం ఉందా? లేదా తెలుసుకుందాం..

WPL Final: ఆఖరి పోరుకు సిద్ధమైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేయింగ్ XIలో కీలక మార్పులు?
Wpl 2023 Final Mi Vs Dc
Venkata Chari
|

Updated on: Mar 26, 2023 | 5:20 AM

Share

MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారణంగా మెగ్ లానింగ్ జట్టు ఫైనల్‌లో నేరుగా ప్రవేశించింది. అదే సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను ఓడించి ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు లీగ్ దశలో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలవగా, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

ఫైనల్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ XI..

ఫైనల్ మ్యాచ్‌కి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చే అవకాశం ఉందా? వాస్తవానికి, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్ సమయంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇది కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా చాలా మంది ఆటగాళ్లకు మద్దతు ఇచ్చింది. అయితే లీగ్ దశలో ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీని కారణంగా ఇరు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఇరు జట్లు ఏ ప్లేయింగ్ XIతో మైదానంలోకి తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (కీపర్), నటాలీ స్కివెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ, జింటిమణి కలిత.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, ఎల్లీస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, మారిజన్ కాప్, తాన్యా భాటియా (కీపర్), జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్