AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఐపీఎల్ 2023లో అత్యధికంగా సంపాదించేది వీరే.. లిస్టులో ధోని, కోహ్లీ, రోహిత్‌లకు నో ఛాన్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. మొట్ట మొదటి IPL మ్యాచ్ ఏప్రిల్ 18, 2008న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగింది.

IPL 2023: ఐపీఎల్ 2023లో అత్యధికంగా సంపాదించేది వీరే.. లిస్టులో ధోని, కోహ్లీ, రోహిత్‌లకు నో ఛాన్స్..
Ipl 2023
Venkata Chari
|

Updated on: Mar 25, 2023 | 5:32 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. మొట్ట మొదటి IPL మ్యాచ్ ఏప్రిల్ 18, 2008న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగింది. కాగా, టోర్నమెంట్ 16వ ఎడిషన్ మార్చి 31, 2023న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హోల్డర్స్ గుజరాత్ టైటాన్స్ (GT) వర్సెస్ నాలుగు సార్లు ఛాంపియన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య బ్లాక్ బస్టర్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. IPL 2023లో చాలా మంది బంఫర్ ప్రైజ్ పొందారు. అయితే, ఈ సీజన్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న నలుగురు ఆటగాళ్లలో కేవలం ఒకే ఒక్క భారత ఆటగాడు మాత్రమే ఉన్నాడు. డిసెంబర్ 23, 2022న జరిగిన ఈ సీజన్ వేలంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు అత్యధిక ధరను సొంతం చేసుకున్నారు.

2023 వేలంలో పంజాబ్ కింగ్స్ (PBKS) రూ.18.5 కోట్లతో సామ్ కర్రాన్‌ను దక్కించుకుంది. దీంతో ఈ సీజన్‌లో అత్యధికంగా ఆర్జించిన ప్లేయర్‌గా నిలిచాడు. లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ (MI) రూ.17.5 కోట్లతో కామెరాన్ గ్రీన్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023లో అత్యధికంగా ఆర్జిస్తోన్న లిస్టులో గ్రీన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్‌ బెన్ స్టోక్స్ రూ. 16.5 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ రూ.17 కోట్లతో జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు.

IPL 2023లో అత్యధిక ప్రైజ్ పొందిన టాప్ 4 ప్లేయర్స్ వీళ్లే..

ఆటగాడు జట్టు ప్రైజ్
సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లు
కామెరాన్ గ్రీన్ ముంబై ఇండియన్స్ రూ. 17.5 కోట్లు
కేఎల్ రాహుల్ లక్నో సైపర్ జెయింట్స్ రూ. 17 కోట్లు
బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.25 కోట్లు

రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ (IPL 2023 ఆడటం లేదు), నికోలస్ పూరన్‌తో కలిసి రూ. 16 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా, 2022 వేలంలో ఇషాన్ కిషన్ రూ. 15.5 కోట్లతో అత్యధిక ప్రైజ్ అందుకున్న లిస్టులో నిలిచాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ 15 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టను నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన ఎంఎస్ ధోని రూ.12 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?