AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి.. డేంజరస్ గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలు ఇవే!

మొదటి సీజన్.. ఏమాత్రం అంచనాలు లేవు.. కనీసం ప్లే-ఆఫ్స్ చేరుతుందా అని అనుమానాలు.. ఇవి గతేడాది ఐపీఎల్‌లో..

IPL 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి.. డేంజరస్ గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలు ఇవే!
Gujarat Titans
Ravi Kiran
|

Updated on: Mar 25, 2023 | 4:15 PM

Share

మొదటి సీజన్.. ఏమాత్రం అంచనాలు లేవు.. కనీసం ప్లే-ఆఫ్స్ చేరుతుందా అని అనుమానాలు.. ఇవి గతేడాది ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్‌పై మొదటిగా కలిగిన భావనలు. అయితేనేం వీటన్నింటినీ పటాపంచలు చేసి.. అరంగేట్రం చేసిన సీజన్‌లోనే టైటిల్‌ను ఎగరేసుకునిపోయింది గుజరాత్ జట్టు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారధ్యంలో ఈ టీమ్ అసాధ్యాన్ని.. సుసాధ్యం చేసిందని చెప్పాలి. ఇక ఇప్పుడు మరోసారి కెప్టెన్ హార్దిక్, కోచ్ ఆశిష్ నెహ్రా మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మునపటి టీంతో పాటు ఈసారి గుజరాత్‌లోకి కొంతమంది స్టార్ ఆటగాళ్లు సైతం భాగం కానున్నారు. మరి ఈ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో చూసేద్దామా..?

2022 ఐపీఎల్‌లో గుజరాత్ జట్టును ఎవ్వరూ కూడా టాప్ 4‌లో ఉంటుందని ఊహించలేదు. కానీ అందరి అంచనాలను హార్దిక్ సేన తలకిందులు చేసింది. లీగ్ రౌండ్‌లో గుజరాత్ అత్యధికంగా 10 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి సరాసరి ఫైనల్‌కు చేరుకుంది.

  • 2023 వేలంలో యువ ఆటగాళ్లపైనే ఫోకస్..

ఈ ఏడాది కూడా గుజరాత్ అదే ఆటతీరును కొనసాగించాలని భావిస్తోంది. IPL 2023 మినీ వేలంలో శివమ్ మావి, కెఎస్ భరత్, కేన్ విలియమ్సన్, జోష్ లిటిల్‌లను కొనుగోలు చేసింది గుజరాత్ యాజమాన్యం. ఈ ఆటగాళ్ల రాకతో టైటాన్స్ జట్టు మరింత పటిష్టంగా మారింది. అలాగే ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.

  • బ్యాటింగ్ బలం..

గుజరాత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఓపెనర్‌గా, జట్టులో శుభ్‌మాన్ గిల్ వంటి పేలుడు బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. అదే సమయంలో కేన్ విలియమ్సన్ రాకతో టాప్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది. రాహుల్ టేవాటియా, మిల్లర్, హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ శంకర్, అభినవ్ మనోహర్ గత సీజన్‌లో ఆకట్టుకోలేకపోయారు. అయితే ఈ సీజన్‌లో మెరుగైన ఆటతీరు కనబరచవచ్చు. రషీద్ ఖాన్ కూడా భారీ సిక్సర్లు కొట్టగల సమర్థుడు, చివరి నిమిషంలో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. అయితే ఒక్కటే సమస్య.. అది బ్యాటింగ్ ఆర్డర్.. ఇదే జట్టుకు పెద్ద తలనొప్పిగా మారవచ్చు. గిల్‌తో ఎవరు ఓపెనర్‌‌గా దిగుతారు..? వృద్ధిమాన్ సాహా బెంచ్‌పై కూర్చోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు గుజరాత్ సమాధానాలు వెతకాలి.

  • రషీద్ కీ బౌలర్..

బౌలింగ్ విషయానికొస్తే, జట్టులో స్పిన్నర్ రషీద్ ఖాన్ కీ బౌలర్ కానున్నాడు. ఆ తర్వాత సాయి కిషోర్, రాహుల్ టేవాటియా కూడా బంతిని పంచుకోనున్నారు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు. ఫాస్ట్ బౌలింగ్‌ను మహ్మద్ షమీ లీడ్ చేయనుండగా.. శివమ్ మావి, జోష్ లిటిల్‌ అతనికి సహాయం అందిస్తారు.

గుజరాత్ టైటాన్స్ ఫుల్ స్క్వాడ్:

హార్దిక్ పాండ్యా (C), శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ టేవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాళ్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్.సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, కె.ఎస్.భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ