- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: here is the list of most expensive players in the IPL 16th Season checkout for the names
IPL 2023: రోహిత్, కోహ్లీ, ధోనీ కానే కాదు; ఈ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..
ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. ఈ క్రమంలో టోర్నీలోని 10 జట్లకు సంబంధించిన ఆటగాళ్లు ఇప్పటికే.. ప్రపంచలోనే అత్యంత రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ రూ.15 కోట్లు, ధోని రూ.12 కోట్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లెవరనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 25, 2023 | 5:26 PM

ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 18.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు కూడా సామ్ కర్రనే.

సామ్ కర్రన్ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడు. ఈ ఆల్‌రౌండర్‌ను ముంబై ఇండియన్స్ 17.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 3వ స్థానంలో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతనికి 17 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది.

4వ స్థానంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఉన్నాడు. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.5 కోట్లు ఖర్చు చేసింది.

16 కోట్లతో 5వ స్థానంలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్(ఐపీఎల్ 2023 ఆడటం లేదు), నికోలస్ పూరన్ ఉన్నారు.

రూ. 15.5 కోట్లు పారితోషికం అందుకుంటున్న ఇషాన్ కిషన్ 6వ స్థానంలో ఉన్నాడు. ఇషాన్ ముంబై ఇండియన్స్ ఆటగాడు .

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడైన కింగ్ కోహ్లి రూ.15 కోట్లు అందుకుంటున్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే ఎంఎస్ ధోనీ రూ.12 కోట్లు తీసుకుంటున్నాడు.




