- Telugu News Photo Gallery Cricket photos Asia Cup 2023 in Pakistan: India won't travel to Pakistan to play Asia cup matches will play at neutral places
Asia Cup 2023: పాకిస్తాన్‌లోనే ఆసియా కప్.. భారత్ విషయంలో ఏసీసీ తీసుకున్న నిర్ణయం ఇదే..
ఆసియా కప్-2023 టోర్నమెంట్‌కు ఈ సారి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్-2023 టోర్నీ పాక్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏసీసీ గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది..
Updated on: Mar 24, 2023 | 7:11 PM

ఆసియా కప్-2023 టోర్నమెంట్‌కు ఈ సారి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్-2023 టోర్నీ పాక్‌లో ప్రారంభంకానుంది.

ఆసియా కప్-2023 పాకిస్తాన్‌లో జరగనుండటంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది.

ఐతే తొలుత ఆసియా కప్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) భావించినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని తెగేసి చెప్పింది.

దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. టీమిండియా ఆసియా కప్ ఆడేలా, అలాగే టోర్నీ పాకిస్తాన్‌లోనే జరిగేలా ఏసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం ఒమన్, యూఏఈ, ఇంగ్లండ్, శ్రీలంక దేశాల్లో ఏదైనా ఒక తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టీమిండియా ఆసియా కప్ ఫైనల్ బెర్తు బుక్ చేసుకుంటే.. ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.




