Fighting Video: ఓరి భగవంతుడా..? 190 కిలోల బరువున్న వ్యక్తితో ఫైట్ చేస్తున్న 72 ఏళ్ల వృద్ధుడు.. చివరకు ఎవరు గెలిచారంటే..?

WWE, UFC పోటీలలో పాల్గొనేవారంతా కూడా దాదాపు 40-45 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారే అయ్యుంటారు. ఎందుకంటే సాధారణంగానే 50 ఏళ్లు దాటిన వారికి 30-40 ఏళ్ల వయసులో ఉన్నంత బలం వారి చేతుల్లో ఉండదు. కానీ ప్రస్తుతం..

Fighting Video: ఓరి భగవంతుడా..? 190 కిలోల బరువున్న వ్యక్తితో ఫైట్ చేస్తున్న 72 ఏళ్ల వృద్ధుడు.. చివరకు ఎవరు గెలిచారంటే..?
420 Pound Fighter Vs 72 Year Old Man
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 25, 2023 | 6:01 PM

మనలో చాలా మంది WWE, UFC ఫైట్‌లను ఇష్టపడుతుంటారు. ఆయా ప్రోగ్రామ్‌లలో పోటీదారులు కొట్టుకోవడాన్ని చూసి చాలా సరదాగా ఫీలవుతాము. వారి ఫైట్‌లకు ఫ్యాన్ కూడా అయిపోతుంటారు చాలా మంది. ఇక ఆ పోటీలలో పాల్గొనేవారంతా కూడా దాదాపు 40-45 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారే అయ్యుంటారు. ఎందుకంటే సాధారణంగానే 50 ఏళ్లు దాటిన వారికి 30-40 ఏళ్ల వయసులో ఉన్నంత బలం వారి చేతుల్లో ఉండదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫైటింగ్ వీడియోలో 72 ఏళ్ల వృద్ధుడు 30-35 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తితో బాక్సింగ్ చేస్తున్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో అది కాస్త వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Fight Haven అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో 420 పౌండ్ల(190 కిలోలు) బరువు ఉన్న వ్యక్తితో 72 ఏళ్ల వృద్ధుడు వీరోచితంగా బాక్సింగ్ చేస్తుంటాడు. ఎంతలా ఫైట్ చేశాడంతే.. 190 కేజీల బరువున్న వ్యక్తి కూడా ఒక్క దెబ్బకు నలిగిపోయేంత బలాన్నిఆ వృద్ధుడు ప్రదర్శించాడు. సుమో రెజ్లర్ లాంటి లావుపాటి వ్యక్తి సన్నగా ఉన్న వ్యక్తితో ఎలా పోరాడుతున్నాడన్నది మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కొట్టిన పంచ్‌లకు లావుగా ఉన్న వ్యక్తి నోటి నుంచి రక్తం కూడా వచ్చింది. 7 పదుల వయసులోనూ పదహారేళ్ల కుర్రాడిలా ఆడిన ఆ వృద్ధుడి పోరాట పటిమను వీడియో ద్వారా చూసిన నెటిజన్లు అతనిని ప్రశంసిస్తున్నారు. ఇంకా దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 17 లక్షల వీక్షణలు, 10 వేల 5 వందలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘టెక్నిక్, అనుభవం ఎల్లప్పుడూ కూడా బరువు, పరిమాణాన్ని కొట్టేసి ఓడించగలవ’ని రాసుకొచ్చాడు. అలాగే ‘బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి నాకు అలాంటి ప్రేరణ అవసరం’ అని కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..