Viral: పెళ్లికి ముందు అందుకు నో చెప్పిన వరుడు.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..!
ఏ వధువుకైనా పెళ్లి తరువాత భర్త ఇల్లే తన ఇల్లు అవుతుంది. ఆ ఇంటి అధికారాలన్నీ ఆమెకే వస్తాయి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి తరువాత భర్త ఇల్లంతా ఆమే చూసుకుంటుంది. ఇక భర్త జీతం కూడా భార్యే తీసుకుంటుందనే హాస్యభరితమైన కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే, పరిస్థితులకు అనుగుణంగా..
ఏ వధువుకైనా పెళ్లి తరువాత భర్త ఇల్లే తన ఇల్లు అవుతుంది. ఆ ఇంటి అధికారాలన్నీ ఆమెకే వస్తాయి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి తరువాత భర్త ఇల్లంతా ఆమే చూసుకుంటుంది. ఇక భర్త జీతం కూడా భార్యే తీసుకుంటుందనే హాస్యభరితమైన కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే తత్వంతో, నిగ్రహంతో ఉంటే ఆ జంట కాపురం సంతోషంగా సాగుతుంది. ఇక వివాహ బంధంలో బీటలుబారడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మరీ విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి చైనాలో చోటు చేసుకుంది. సిల్లీ కారణంలో ఓ అమ్మాయి.. నెల రోజుల్లో జరగాల్సిన పెళ్లిని క్యాన్సిల్ చేసింది. అదే ముహూర్తానికి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దాంతో పెళ్లి క్యాన్సిల్ అయిన యువకుడు.. తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచాడు. వివరాలు ఇప్పుడు చూద్దాం.
చైనాకు చెందిన ఓ యువతీ యువకుడికి వివాహం నిశ్చయమైంది. యువకుడికి మంచి జీతం వస్తుంది. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కూడా. ఇంకేముంది.. ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, మరో నెలలో పెళ్లి అనగా.. బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సరదాగా ఇద్దరూ మాట్లాడుకోవడానికి బయటకెళ్లారు. ఆ సందర్భంలో యువతి.. తన కాబోయే భర్తను ఒక కోరిక కోరింది. ఉద్యోగంలో వార్షిక బోనస్ ఏమైనా వస్తే తనకు ఇవ్వాలని కోరింది. అయితే, ఆ యువకుడు నో చెప్పాడు. ఇంకేముంది.. నా మాట కాదంటావా? అంటూ అలిగి బుంగమూతి పెట్టిందా యువతి. అంతటితో ఆగితే పర్వాలేదు అనుకోవచ్చు. కానీ, ఆమె నేరుగా ఇంటికెళ్లి.. ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ సందేశం పంపింది. నాలుగేళ్ల ప్రేమ బంధం, మరో నెలలో పెళ్లితో ఒక్కటవ్వాల్సిన వివాహ బంధం ఒక్క మాటతో పుటుక్కుమంది. యువతి చేసిన పనికి ఆ యువకుడు షాక్ అయ్యాడు. అంతేకాదండోయ్.. నెల రోజుల ముందే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న యువతి.. అదే సమయానికి మరో యువకుడితో పెళ్లి చేసుకుంది.
అయితే, తన బాధను సదరు యువకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. చిన్న కారణంతో యువతి తనను రిజెక్ట్ చేసిందంటూ వాపోయాడు. నాలుగేళ్ల బంధాన్ని కాదని, చిన్న కారణంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని బాధను వ్యక్తం చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..