AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Special: వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు..

ఈ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మీ శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నీటితో పాటు, పండ్లు, కూరగాయల జ్యూస్‌లు తాగడం వల్ల కూడా శరీరం కూల్ అవుతుంది.

Summer Special: వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచే 5 అద్భుతమైన ఆహారాలు..
Lemon
Shiva Prajapati
|

Updated on: Mar 24, 2023 | 10:44 PM

Share

ఈ వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మీ శరీరం డీహైడ్రేట్‌కు గురవుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. నీటితో పాటు, పండ్లు, కూరగాయల జ్యూస్‌లు తాగడం వల్ల కూడా శరీరం కూల్ అవుతుంది. ఈ డ్రింక్స్‌ని రోజువారీ భోజనంలో తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే సీజన్‌ను బట్టి ఆహారం మార్చుకోవాలి. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు:

పెరుగు:

పెరుగు జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగు మాత్రమే కాదు, పాలు, చీజ్ మొదలైన పాల ఉత్పత్తులలో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. వేసవి రోజుల్లో కడుపు చల్లగా ఉండాలంటే రోజుకు ఒక్కసారైనా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. లేదంటే పెరుగు బజ్జీ లేదా పెరుగు బేస్డ్ స్మూతీస్ తయారు చేసి తాగవచ్చు.

పుచ్చకాయ:

వేసవిలో పుచ్చకాయ తినడం చాలా మంచింది. దీన్ని జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో దీనిని తినడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

ఓట్స్ ఊక:

ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది కరిగే, కరగని ఫైబర్ రెండింటినీ కలిగి ఉన్నందున ఇది గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్ ఊక జీర్ణాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఖనిజాలు, విటమిన్లను కలిగి ఉంటుంది. ఓట్ బ్రాన్‌తో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

హెర్బల్ డ్రింక్స్:

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి రోజంతా నీరు ఎక్కువగా తాగి అలసిపోయారా? మరేంపర్వాలేదు. నీటికి బదులుగా రుచికరమైన హెర్బల్ డ్రింక్స్ తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. పుదీనా, నిమ్మకాయలో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఒక జగ్గులో నీళ్ళు నింపి దానికి పుదీనా ఆకులు, నిమ్మరసం కలపాలి. ఇందులో నచ్చిన పండ్లను కూడా యాడ్ చేయొచ్చు. బాగా మిక్స్ చేసి కొంత సమయం తర్వాత తాగాలి.

దోసకాయ:

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు దోసకాయ ఉత్తమమైన ఆహారం. సాదాసీదాగా తినడానికి ఇష్టపడని వారు దోసకాయల సలాడ్ చేసి తినవచ్చు.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..