Facts about Lions: వృద్ధాప్యంలో సింహాలు ఆత్మహత్య చేసుకుంటాయా? ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
అడవికి రాజు సింహం. ఈ మృగరాజును చూస్తే అడవిలో ఏ జీవి ప్రాణ భయంతో పరుగులు పెట్టాల్సిందే. కారణం.. దాని ముందు ఏ జీవి ఉందన్న ఆలోచనే లేకుండా, ధైర్యంగా పోరాడే తత్వం. దాని లక్షణాలే దాని బలం. అందుకే సింహం అంటే మిగతా జంతువులకు హడల్. అయితే, మనుషులు సహా ప్రతి జీవికి జీవన గమనం ఉంటుంది. శి
అడవికి రాజు సింహం. ఈ మృగరాజును చూస్తే అడవిలో ఏ జీవి ప్రాణ భయంతో పరుగులు పెట్టాల్సిందే. కారణం.. దాని ముందు ఏ జీవి ఉందన్న ఆలోచనే లేకుండా, ధైర్యంగా పోరాడే తత్వం. దాని లక్షణాలే దాని బలం. అందుకే సింహం అంటే మిగతా జంతువులకు హడల్. అయితే, మనుషులు సహా ప్రతి జీవికి జీవన గమనం ఉంటుంది. శిశు దశ నుంచి వృద్ధాప్యాన్ని అనుభవించాల్సిందే. సింహం కూడా వృద్ధాప్యాన్ని అనుభవిస్తుంది. మరి సింహం వృద్ధాప్య జీవితం ఎలా గడుస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? శక్తి క్షీణించిన సింహానికి ఆహారం ఎలా వస్తుంది? దాని జీవితం ఎలా ఉంటుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని కథనాల ప్రకారం శక్తి క్షీణించినప్పుడు సింహం ఆత్మహత్య చేసుకుంటుందని అంటుంటారు. మరి అది నిజమేనా? సింహం అడవి జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు మీకోసం..
సింహం వృద్ధాప్యంలో ఏం చేస్తుంది?
వృద్ధాప్యంలో సింహం వేటాడదు అనే సాధారణ అపోహ ఉంది. మరి ఆహారం తినకుండా సింహం ఏం చేస్తుంది? ఒక కథనం ప్రకారం సింహం వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకుంటుందా? ఎంతమాత్రం నిజం కాదంటున్నారు జంతు పరిశోధకులు. సింహం జీవిత కాలం 25 ఏళ్లు అయితే 12 ఏళ్ల వయసులో బలహీనంగా మారుతుంది. ఈ పరిస్థితిని సింహం వృద్ధాప్యం అంటారు. యవ్వనంలో సింహం తనకు కావలసిన ఆహారం కోసం వేటాడుతుంది. ఈ సమయంలో అది చాలా శక్తి, చురుకుదనం కలిగి ఉంటుంది. వృద్ధాప్యంలో దాని శక్తి, చురుకుదనం తగ్గుతుంది. అందుకే వృద్ధాప్యంలో వేగంగా పరుగెత్తలేని చిన్న, బలహీనమైన జంతువులను వేటాడుతుంది. కాలక్రమేణా అది బలహీనంగా మారి ప్రాణాలు కోల్పోతుంది.
ఇతర సింహాలతో పోరాటం..
సింహం వృద్ధాప్యంతో తన అడవిని రక్షించుకోలేని స్థితికి చేరినప్పుడు.. ఇతర సింహాలు దాని భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ పోరాటంలో వృద్ధ సింహం గాయపడితే.. ఆ గాయంతోనే ప్రాణాలు కోల్పోతుంది.
సింహం వేటాడదు..
మగ సింహం ఎప్పుడూ ఆహారం కోసం వేటాడదు. ఆ సింహాలే 90శాతం వేటను చేస్తాయి. మగ సింహం మాత్రం ఆ ఆడ సింహాలకు రక్షణగా ఉంటుంది. ఇతర జంతువుల నుంచి ఆడ సింహాలను కాపాడుతుంది. అడవిలో పెట్రోలింగ్ చేస్తూ తన భూభాగం నిర్ధారిస్తుంది సింహం. పోరాటంలో సింహం ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ.. ఆ సింహం గెలిచిన యువ సింహంతో జీవించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఆ ముసలి సింహం ఆకలితో చనిపోతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..