AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: మద్యం సేవించిన తరువాత జరిగిన సంఘటనలను ఎందుకు మర్చిపోతారు? దిమ్మతిరిగే విషయాలు మీకోసం..

ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానీకరం అనే విషయం తెలిసిందే. ఆరోగ్య సంబంధిత సమస్యలకు కారణమే కాకుండా, ఆర్థికంగా నాశనం చేస్తుంది. అయితే, ఆల్కాహాల్ ఎక్కువగా తాగడం వల్ల ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. తాగిన తరువాత స్పృహ కోల్పోతుంటారు. తాగిన తరువాత కారణం లేకుండానే నవ్వడం, ఏడ్వడం, అరవడం చేస్తుంటారు.

Alcohol: మద్యం సేవించిన తరువాత జరిగిన సంఘటనలను ఎందుకు మర్చిపోతారు? దిమ్మతిరిగే విషయాలు మీకోసం..
Alcohol Facts
Shiva Prajapati
|

Updated on: Mar 24, 2023 | 10:37 PM

Share

ఆల్కాహాల్ ఆరోగ్యానికి హానీకరం అనే విషయం తెలిసిందే. ఆరోగ్య సంబంధిత సమస్యలకు కారణమే కాకుండా, ఆర్థికంగా నాశనం చేస్తుంది. అయితే, ఆల్కాహాల్ ఎక్కువగా తాగడం వల్ల ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. తాగిన తరువాత స్పృహ కోల్పోతుంటారు. తాగిన తరువాత కారణం లేకుండానే నవ్వడం, ఏడ్వడం, అరవడం చేస్తుంటారు. మత్తు తగ్గిన తరువాత తాము చేసిన చర్యల గురించి ప్రస్తావింతే అలా చేయలేదని బుదులిస్తారు. అయితే, ఇదే అంశంపై అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్కాహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో ప్రపంచ వ్యాప్తంగా ఆల్కాహాల్ తాగి ఎంతమంది స్పృహ కోల్పోతున్నారా? ఎంత మంది తాము చేసిన పనులను మర్చిపోతున్నారు? వంటి అంశాలపై ఆసక్తికర విషయాలు చెప్పింది.

మద్యం సేవించిన తర్వాత ఎందుకు స్పృహ కోల్పోతారు?

ఆల్కహాల్ తాగిన తర్వాత చాలా మంది ప్రజలు స్పృహ కోల్పోతుంటారు. పరిమితికి మించి తాగితే.. బ్లాక్ అవుట్ అవుతారు. అంటే ఆ సమయంలో తమ చుట్టూ ఏం జరుగుతోందో వారికి ఏమీ గుర్తుండదు. దీనికి సంబంధించి 1000 మంది విద్యార్థులపై ఒక పరిశోధన నిర్వహించారు. అందులో కనీసం మూడింట రెండు వంతుల మంది అంటే 66.4% మంది మద్యం సేవించి పాక్షికంగా బ్లాక్‌అవుట్‌కు గురయ్యారని తేలింది.

హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయం కూడా మానవ మెదడుపై ఆల్కహాల్ ప్రభావంపై ఒక పరిశోధనను నిర్వహించింది. ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత మెదడు బలహీనపడుతుందని తేల్చారు. మద్యం సేవించడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం బలహీనపడుతుంది. ఆ సమయంలో ఏం జరిగినా.. మత్తు దిగిన తరువాత గుర్తుండదు.

ఇవి కూడా చదవండి

మద్యం సేవించిన తర్వాత మెదడులో ఏం జరుగుతుంది?

ఆల్కహాల్‌లో ఉండే ఇథనాల్ ఆల్కహాల్‌లోని అతి చిన్న అణువు అని హైడెల్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుడు హెల్మట్ జైట్స్ ఈ నివేదికలో వివరించారు. ఇది రక్తం, నీటిలో సులభంగా కరుగుతుంది. అయితే, మానవ శరీరంలో 70 నుంచి 80 శాతం నీరు ఉంటుంది. శరీరంలోకి చేరిన వెంటనే ఆల్కహాల్ స్వేచ్ఛగా శరీరం అంతటా వ్యాపించడానికి, మెదడుకు చేరుకోవడానికి ఇది కారణం. ఇది మెదడుకు చేరిన వెంటనే, మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా నాడీ వ్యవస్థ కేంద్రం ప్రభావితమవుతుంది. నాడీ వ్యవస్థ ప్రభావితమైతే గందరగోళ స్థితికి చేరుకున్నారని అర్థం. కొన్నిసార్లు జరిగిన విషయాలను మరచిపోతుంటారు. మత్తు దిగాక.. ఈ పరిస్థితి నుంచి బయటపడతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..