Business Idea: విలేజ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా..? ఈ ఐడియాలను ఫాలో అయితే చాలు.. తక్కువ పెట్టుబడి-ఎక్కువ రాబడి..

చాలా మంది యువత ఉద్యోగాలకన్నా వ్యాపారమే బెస్ట్ అనుకుంటున్నారు. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాల గురించి రోజూ సెర్చ్ చేస్తున్నారు. పట్నంతో పనిలేకుండా ఉన్న ఊరిలోనే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని

Business Idea: విలేజ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా..? ఈ ఐడియాలను ఫాలో అయితే చాలు.. తక్కువ పెట్టుబడి-ఎక్కువ రాబడి..
Business Ideas
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 25, 2023 | 8:22 PM

ప్రస్తుత కాలంలో యువత ఉద్యోగాల కంటే వ్యాపారంవైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటికే పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న నేపథ్యంలో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోన్న భయం చాలా మందిని వెంటాడుతోంది. అయితే చాలా మంది యువత ఉద్యోగాలకన్నా వ్యాపారమే బెస్ట్ అనుకుంటున్నారు. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వ్యాపారాల గురించి రోజూ సెర్చ్ చేస్తున్నారు. పట్నంతో పనిలేకుండా ఉన్న ఊరిలోనే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే కొన్ని వ్యాపారాలు ఏమున్నాయా అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. అలాంటివారి కోసమే కొన్ని వ్యాపార చిట్కాలను అందిస్తున్నాము. ఈ మార్గాలను అనుసరిస్తే మీకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ. మీరు కూడా వ్యాపారం చేయాలనుకున్నట్లయితే వీటి గురించి ఓ సారి ఆలోచించండి..

కోళ్ళ ఫారం: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యాపారాలలో కోళ్ల పెంపకం అనేది కూడా ఒకటి. ఎందుకంటే ఇది ప్రతిచోటా స్థాపించబడుతుంది. మంచి జాతి కోడి నెలకు ఎలా కాదనుకున్నా 20-25 గుడ్లు ఇస్తుంది. ఇక మీకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నట్లయితే.. మీరు ఎవరి సహాయం లేకుండానే మీ ఇంటి నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంకా ప్రస్తుత కాలంలో ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం. దీని నుంచి మీరు పెట్టిన పెట్టుబడిని కేవలం ఒక నెలలో సంపాదించవచ్చు.

సేంద్రీయ వ్యవసాయం, వర్మికల్చర్: ఈ రకమైన వ్యవసాయంలో సేంద్రీయ వ్యర్థ ఉత్పత్తులను(ఆహారం, చెట్ల ఆకులు, ఆవు పేడ వంటివి) ఉపయోగిస్తారు. తక్కువ పెట్టుబడితో అత్యంత లాభదాయకమైన స్టార్టప్ ఏదైనా ఉందంటే అది ఇదే. నేటి కాలంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది, కానీ డిమాండ్‌కి తగ్గట్టుగా కాకుండా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాపారాన్ని తెరవడానికి మీకు సువర్ణావకాశం ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు సేంద్రియ వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ స్టార్టప్ భవిష్యత్తుకు ఉత్తమమైనది. ఎందుకంటే సేంద్రీయ ఉత్పత్తికి చాలా డిమాండ్ ఉంది. ఇంకా ప్రభుత్వం కూడా ఈ వ్యాపారం చేసేవారికి బాసటగా నిలుస్తోంది. సేంద్రీయ వ్యవసాయం కోసం కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. పరంపరగత్ కృషి వికాస్ యోజన(PKVY), సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్ (SHM)వంటి పలు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

వర్మీ కంపోస్ట్: వానపాముల ఎరువు కూడా సేంద్రీయ వ్యవసాయంలో ఒక భాగమే. అందుకే వానపామును రైతు స్నేహితుడని కూడా పిలుస్తారు. వానపాములు వ్యర్థ పదార్థాలను కుళ్ళిపోయి భూమిని పోషకాలతో సమృద్ధిగా మారుస్తాయి. వానపాముల జాతి గురించి మీకు కొంచెం అవగాహన ఉంటే, మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు మీ వర్మీ కంపోస్ట్ మట్టి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా ఆన్‌లైన్ మార్కెటింగ్ కూడా చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

పాడిపరిశ్రమ: ఇది భారతదేశంలోనే అత్యుత్తమ వ్యవసాయ వ్యాపారం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పాలకు రోజురోజుకు అధిక డిమాండ్ ఉంది. ఇది మొత్తం వ్యవసాయ వ్యాపారంలో అత్యంత లాభదాయకమైన వ్యాపారం. భారత ప్రభుత్వం, NABARD కూడా ఈ వ్యాపార చేయాలనుకుంటున్నవారికి రుణాలు అందిస్తుంది. అనేక బ్యాంకులు పాడి పరిశ్రమ కోసం 10 లక్షల వరకు రుణాలు కూడా ఇస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు పాడి పరిశ్రమ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి .

మత్స్య సంపద: చేపల వ్యాపారం భారతదేశంలో ప్రముఖ వ్యాపారంగా ఉద్భవించింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMSY)ని కూడా ప్రారంభించింది . ఈ పథకం కింద, అభ్యర్థి మొత్తం వ్యయంలో 75% తిరిగి సబ్సిడీగా ఇవ్వబడుతుంది. అనేక రకాల చేపలను ఔషధాలకు కూడా ఉపయోగిస్తారు. వాటి నుండి నూనెను కూడా తయారు చేస్తారు. మీరు పూర్తి జ్ఞానంతో చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభిస్తే , చేపల పెంపకం మీకు చాలా లాభదాయకమైన వ్యాపారంగా నిలుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!