Gold Jewelry: బంగారు అభరణాల్లో మోసాలు.. నగలు కొనేముందు ఒరిజినలా..? నకిలీవా..? గుర్తించడం ఎలా?
దేశంలో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆభరణాల మార్కెట్‌లో వేగవంతమైన బూమ్ కనిపిస్తుంది. ఈ సమయంలో మోసం కేసులు కూడా పెరుగుతున్నాయి. చాలా సార్లు నగల వ్యాపారులు మిమ్మల్ని నకిలీ ఆభరణాలతో మోసాగించే అవకాశాలు కూడా ఉంటాయి. హాల్ మార్కింగ్ లేని బంగారు..
దేశంలో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆభరణాల మార్కెట్‌లో వేగవంతమైన బూమ్ కనిపిస్తుంది. ఈ సమయంలో మోసం కేసులు కూడా పెరుగుతున్నాయి. చాలా సార్లు నగల వ్యాపారులు మిమ్మల్ని నకిలీ ఆభరణాలతో మోసాగించే అవకాశాలు కూడా ఉంటాయి. హాల్ మార్కింగ్ లేని బంగారు అభరణాలు చాలా షాపుల్లో విక్రయిస్తున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. తరచుగా కస్టమర్ దానిని స్వచ్ఛమైన బంగారం అని అనుకొని మోసపోతున్నారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు నిజమైన, నకిలీ ఆభరణాల మధ్య తేడాను గుర్తించే కొన్ని చిట్కాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 2021 నెల నుంచి బంగారం అమ్మకాల సమయంలో ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేసింది. హాల్‌మార్కింగ్ లేకుండా బంగారాన్ని విక్రయించడం ద్వారా నగల వ్యాపారులు మిమ్మల్ని చాలాసార్లు మోసం చేస్తారు.
- ప్రస్తుతం నిజమైన, నకిలీ బంగారాన్ని గుర్తించడం చాలా సులభం. దీని కోసం మీరు కొన్ని ప్రాథమిక చిట్కాలను అనుసరించాలి. బంగారం కొనుగోలు చేసేటప్పుడు BIS త్రిభుజాకార గుర్తును తనిఖీ చేయండి. ఇది కాకుండా, హాల్‌మార్కింగ్ విలువను తనిఖీ చేయడానికి ఆభరణాల రశీదుని తీసుకోండి.
- మీ బంగారం హాల్‌మార్క్ 375 అయితే అది దాదాపు 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం అని తెలుసుకోండి. బంగారంపై హాల్‌మార్క్ 585 అయితే అది 58.5 శాతం స్వచ్ఛంగా ఉంటుంది. మరోవైపు 990 అయితే బంగారం 99.0 శాతం అని, ఇది కాకుండా బంగారం హాల్‌మార్క్ 999 అయినప్పుడు అది 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అని అర్థం.
- మీరు నిజమైన, నకిలీ బంగారాన్ని గుర్తించడానికి నైట్రిక్ యాసిడ్‌ని కూడా ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా నగలపై కొద్దిగా గీతలు వేసి దానిపై నైట్రిక్ యాసిడ్ పోయడమే. బంగారం రంగులో మార్పు రాకపోతే మీ బంగారం నిజమైనదని అర్థం చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి