Telugu News Trending Meta CEO Mark Zuckerberg and wife Priscilla Chan welcome their third baby girl
Mark Zuckerberg: మూడోసారి తండ్రయిన జుకర్‌బర్గ్.. ‘అందిన వరం’ అంటూ ఫోటో షేర్..
కొన్ని నెలల క్రితం జుకర్‌బర్గ్ ప్రకటించినట్లుగానే భార్య ప్రిస్కిలా చాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా తెలియజేశాడు. ఇక ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఉన్న..
Mark Zuckerberg And Wife Priscilla Chan Welcome Their Third Baby Girl
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మూడో సారి తండ్రయ్యాడు. కొన్ని నెలల క్రితం జుకర్‌బర్గ్ ప్రకటించినట్లుగానే భార్య ప్రిస్కిలా చాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా తెలియజేశాడు. ఇక ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఉన్న జుకర్‌బర్గ్, ప్రిస్కిలా చాన్ జంటకు మూడోసారి కూడా అమ్మాయే పుట్టడం విశేషం. దీనిపై జుకర్‌బర్గ్ తన మూడో కూతురు ఫోటోను కూడా షేర్ చేస్తూ.. సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ‘ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్ జూకర్ బర్గ్. నువ్వు మాకు వరం లాంటిదానివి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
అయితే 2023 కొత్త ఏడాది సందర్భంగా జుకర్‌బర్గ్ తన భార్య ప్రెగ్నెంట్ అని పోస్ట్ చేస్తూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. కాగా, హార్వర్డ్ యూనివర్సిటీలో కాలేజీ మేట్స్ అయిన మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్కిల్లా చాన్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఈ ప్రేమ జంటకు ఇప్పటివకే మాక్సిమా చాన్, ఆగస్ట్ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మూడో కుమార్తెకు కూడా తల్లిదండ్రులయ్యారు జుకర్‌బర్గ్ దంపతులు. కాగా, జుకర్‌బర్గ్ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అవడంపై పలువురు ప్రముఖులు, అభిమానులు, అలాగే నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.