Telugu News Sports News Women’s World Boxing Championships: Nitu Ghanghas wins gold after defeating Mongolia’s Lutsaikhan Altansetseg becomes 6th Indian woman to win gold
Boxing Championship: బాక్సింగ్‌లో నీతూ సంచలనం.. 48 కిలోల విభాగంలో స్వర్ణ పతకం.. పూర్తి వివరాలివే..
కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత నీతూ గంగాస్ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ తొలి పసిడిని సొంతం చేసుకుంది. 48 కిలోల కేటగిరీలో ఈ రోజు జరిగిన ఫైనల్ బౌట్‌లో నీతూ గంగాస్.. మంగోలియా..
Nitu Ghangas won gold for India at the World Championships
ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత నీతూ గంగాస్ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ తొలి పసిడిని సొంతం చేసుకుంది. 48 కిలోల కేటగిరీలో ఈ రోజు జరిగిన ఫైనల్ బౌట్‌లో నీతూ గంగాస్.. మంగోలియా మహిళా బాక్సర్ లుత్సాయ్ ఖాన్‌పై విజయం సాధించింది. రెండు సార్లు యూత్ ఛాంపియన్‌గా నిలిచిన నీతూ ఈ పోరులో 5-0తో ప్రత్యర్థిని చిత్తు చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి బలహీనతలనే ప్రధానంగా సొమ్ము చేసుకున్న నీతూ తొలి నుంచి కూడా దూకుడు కనబరుస్తూ, వివిధ కాంబినేషన్లలో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ఈ విజయంతో నీతూ గంగాస్ భారత్ తరఫున ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన 6వ మహిళా బాక్సర్‌గా చరిత్ర పుటల్లో నిలిచింది. నితూ గంగాస్ కంటే ముందు భారత్ తరఫున.. 2002, 2005, 2006, 2008, 2010, 2018లో మేరీ కోమ్ పసిడి పతకాలు నెగ్గుకొచ్చింది. అలాగే 2006లో సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, గతేడాది అంటే 2022లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించారు.
ఇక నీతూ గంగాస్ గురించి చెప్పుకోవాలంటే.. 22 ఏళ్ల ఈ యువ బాక్సర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‍లో రెండో సారి పోటీ పడింది. అంతకుముందు రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్(RSC) జడ్జ్‌మెంట్ ద్వారా మూడు విజయాలు నమోదు చేయగా.. గతేడాది మాత్రం సెమీస్‌కే పరిమితమైంది. ఈ ఏడాది సెమీ ఫైనల్‌లో కజకిస్థాన్ ప్లేయర్ అలువా బల్కిబేకోవాను ఓడించిన నీతూ ఫైనల్‌కు చేరింది. తాజాగా ఈ రోజు జరిగిన ఫైనల్లో మంగోలియన్ బాక్సర్ లుత్సాయ్ ఖాన్‌కు తన పంచ్ పవర్ చూపి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు భారత మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్(50 కేజీలు) లవ్లీనా (75 కేజీలు), స్వీటీ బూర (81 కేజీలు) కూడా ఫైనల్‌కు చేరారు. నీతూ గంగాస్ మ్యాచ్ అనంతరం స్వీటీ బూర కూడా ఫైనల్ ఫైట్‌లో పాల్గొనబోతుంది. స్విటీ బూర తన ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ లినాతో 81 కేజీల విభాగంలో పోటీ పడుతోంది.