Chicken Liver Fry: ఆదివారం స్పెషల్.. చికెన్ లివర్ ఫ్రై.. ఆంధ్రా స్టైల్‌లో టేస్టీగా ఇలా ట్రై చేసి చూడండి
ముందుగా చికెన్ లివర్ ను శుభ్రం చేసుకుని అందులో పసుపు, నిమ్మరసం వేసుకుని కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. నూనె సరిపడా వేసుకోవాలి. లివర్ ను వేసి కొంచెం సేపు వేయించాలి.
నాన్ వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు పండగే పండగ.. నోరూరించే నాన్ వెజ్ వంటకాలతో డిఫరెంట్ మెనూతో ఆహారాన్ని తినాలని భావిస్తారు. ముఖ్యంగా చికెన్ ప్రియులు ఫ్రై, కూర, బిర్యానీ ఇలా రకరకాల వంటలు ట్రై చేయాలనుకుంటారు. అయితే చికెన్ లివర్ తో కూడా రుచికరమైన కూరని తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఆంధ్రాస్టైల్ లో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై తయారీ విధానం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
లివర్ -అర కేజీ
పసుపు- కొంచెం
నిమ్మరసం – ఒక స్పున్
పచ్చి మిర్చి – 6
ఉల్లిపాయ
అల్లం వెల్లుల్లి పేస్ట్
ధనియాల పొడి
గరం మసాలా
కొత్తిమీర
కరివేపాకు
నూనె – 4 స్పూన్లు
ఉప్పు
కారం
తయారీ విధానం: ముందుగా చికెన్ లివర్ ను శుభ్రం చేసుకుని అందులో పసుపు, నిమ్మరసం వేసుకుని కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. నూనె సరిపడా వేసుకోవాలి. లివర్ ను వేసి కొంచెం సేపు వేయించాలి. తర్వాత ఆ లివర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నిలువగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు వేసుకుని వేయించాలి. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత లివర్ ను వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, వేసి మగ్గనిచ్చి.. కారం వేసుకుని ధనియాల పొడి వేసి గరం మసాలా వేసి కొంచెం సేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై రెడీ.. ఈ కూర చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..