AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beet Root Pacchadi: రొటీన్ పచ్చళ్ళతో విసిగిపోయారా.. బీట్ రూట్‌తో టేస్టీ టేస్టీ పచ్చడి తయారు చేసిచూడండి.. రెసిపీ మీకోసం

ఒకలాంటి వాసన వస్తుందంటూ బీట్ రూట్ ని పచ్చిగా తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి.. హిమోగ్లోబిన్ పెరగడాని బీట్ రూట్ దివ్య ఔషధం.

Beet Root Pacchadi: రొటీన్ పచ్చళ్ళతో విసిగిపోయారా.. బీట్ రూట్‌తో టేస్టీ టేస్టీ పచ్చడి తయారు చేసిచూడండి.. రెసిపీ మీకోసం
Beet Root Pacchadi
Surya Kala
|

Updated on: Mar 17, 2023 | 9:25 AM

Share

బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి సహజ దివ్య ఔషదం అని చెప్పవచ్చు. బీట్ రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. ఈ బీట్ రూట్ ను తినడానికి పెద్దగా ఇష్టపడరు. ఒకలాంటి వాసన వస్తుందంటూ దానిని పచ్చిగా తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు వెనుకడుగు వేస్తారు. కానీ నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి.. హిమోగ్లోబిన్ పెరగడాని బీట్ రూట్ దివ్య ఔషధం. ఈ నేపథ్యంలో బీట్ రూట్ తో టేస్టీగా ఈజీగా పచ్చడిని తయారు చేసుకోండి..

కావల్సిన పదార్ధాలు..:

బీట్ రూట్- అరకిలో

ఇవి కూడా చదవండి

పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి- (8 నుంచి 10 )

జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్

మినపప్పు- రెండు టేబుల్ స్పూన్లు

శనగపప్పు- ఒక టేబుల్ స్పూన్

వెల్లుల్లి- నాలుగు రెమ్మలు

ధనియాలు- రెండు టేబుల్ స్పూన్లు

చింత పండు -రుచికి సరిపడా

ఉప్ప- రుచికి సరిపడా

తాలింపుకి కావల్సిన వస్తువులు 

ఆవాలు

జీలకర్ర

కరివేపాకు

ఎండు మిర్చి

వెల్లుల్లి రెబ్బలు

ఇంగువ

తయారు చేసే విధానం: ముందుగా బీట్ రూట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి బాణలిలో వేసి నూనె వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. అనంతరం వాటిని తీసి పక్కకు పెట్టుకుని అదే బాణలిలో కొంచెం నూనె వేసి ముందుగా పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి వేయించి అందులో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ధనియాలు వెల్లుల్లి వేయించాలి’ చల్లారిన తర్వాత పోపు దినుసులను ముందుగా మిక్సీ పట్టుకోవాలి . అనంతరం బీట్ రూట్ ముక్కలు వేసి  మిక్సీ వేసుకోవాలి. మెత్తగా నలిగిన తర్వాత చింత పండు గుజ్జు.. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆపై రెడీ అయిన పచ్చడిని తీసుకుని తిరగ మోత వెయ్యాలి. స్టవ్ వెలిగించి బాణలిలో కొంచెం నూనె వేసి అందులో పోపుదినులు వేసుకోవాలి. తర్వాత అందులో బీట్ రూట్ పచ్చడి వేసుకుని కొంచెం వేడి చేయాలి. అంతే టేస్టీ టేస్టీ బీట్ రూట్ పచ్చడి రెడీ.. బీట్ రూట్ ఇష్టం లేని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. అన్నం, చపాతీల్లోకి మాత్రమే కాదు..ఇడ్లి, దోస వంటి టిఫిన్స్ లో కూడా బాగుంటుంది.

మరిన్ని లైఫ్ స్టిల్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..